న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా తెచ్చిన కష్టం.. బీఎం‌డబ్ల్యూ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్‌!!

Indian sprint queen Dutee Chand puts her BMW up for sale on Facebook, deletes post

భువనేశ్వర్: కరోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు నాలుగు నెలల పాటు క్రీడాలోకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇండియన్‌ అథ్లెట్‌ ద్యుతి చంద్‌ శిక్షణ ఖర్చులు తీర్చేందుకు విలువైన బీఎం‌డబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్ధపడ్డారు.

వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. బెన్ ‌స్టోక్స్‌ అరుదైన రికార్డు!!వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. బెన్ ‌స్టోక్స్‌ అరుదైన రికార్డు!!

కారును అమ్మాలనుకుంటున్నా:

కారును అమ్మాలనుకుంటున్నా:

టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో‌ ద్యుతి చంద్‌ నిధుల కొరతతో సతమతమవుతున్నారు. దీంతో ఆమె శిక్షణ ఖర్చుల కోసం తన కారును అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. శిక్షణ ఖర్చులు తీర్చేందుకు బీఎం‌డబ్ల్యూ కారును సోషల్‌ మీడియాలో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ద్యుతినే శనివారం ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. 'ఇప్పటివరకు శిక్షణ చాలా బాగుంది. నేను భువనేశ్వర్‌లో శిక్షణ పొందుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, స్పాన్సర్లు ఇచ్చిన నిధులన్నీ కోచింగ్‌కు ఖర్చు చేశా. అందుకే నా లగ్జరీ బీఎం‌డబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నా. ఎవరైనా కొనాలనుకుంటే నన్ను మెసేంజర్‌లో సంప్రదించండి' అంటూ కారుకు చెందిన ఫోటోలను పోస్టులో పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం సాయం:

రాష్ట్ర ప్రభుత్వం సాయం:

అయితే ఫేసుబుక్‌లో పోస్ట్‌ పెట్టిన తర్వాత ద్యుతి చంద్‌కు సాయం చేసేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తరువాత ఆ పోస్టును ఆమె డిలీట్‌ చేశారు. కాగా ద్యుతీ చంద్ 2015 బీఎం‌డబ్ల్యూ 3 సిరీస్‌ మోడల్‌ను కలిగి ఉన్నారు. ఆమె దానిని 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ కారును స్వయంగా ద్యుతినే కొనుగోలు చేశారు. ఇంట్లో మూడు కార్లు ఉన్నాయి కాబట్టి ఒక కారు అమ్మాలనుకున్నారు.

డబ్బులన్నీ అయిపోయాయి:

డబ్బులన్నీ అయిపోయాయి:

ఓ జాతీయ మీడియాతో ద్యుతీ మాట్లాడుతూ... 'టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ .50 లక్షలు మంజూరు చేసింది. కోచ్, ఫిజియోథెరపిస్ట్స్, డైటీషియన్‌తో పాటు ఇతర ఖర్చులు కలిపి నాకు నెలకు అయిదు లక్షల రూపాయలు ఖర్చవుతోంది. ఇప్పడు నా డబ్బులన్నీ అయిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏ స్పాన్సర్ నా కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేడు. కానీ నేను టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్నాను. నా ఫిట్‌నెస్‌, జర్మనీలో శిక్షణ కోసం నాకు డబ్బు కావాలి. నా శిక్షణ, డైట్‌ ఖర్చులను తీర్చడానికి దీనిని అమ్మేయాలని నిర్ణయించుకున్నా' అని తెలిపారు.

అర్జున అవార్డుకి ఎంపిక:

అర్జున అవార్డుకి ఎంపిక:

ద్యుతి చంద్‌ ఇటీవల అర్జున అవార్డు 2020కి ఎంపికయ్యారు. ఆమె ఆసియా గేమ్స్‌లో రెండు సార్లు రజత పతకాలు సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రస్తుతం ద్యుతి సిద్ధమవుతోంది. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల విరామం తర్వాత మే 25న చంద్ కళింగ స్టేడియంలో ఆమె శిక్షణను ప్రారంభించారు. ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో ఆమె పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ కోసం మరో ఏడాది శిక్షణ తీసుకోవాల్సి ఉంది.

Story first published: Saturday, July 11, 2020, 18:02 [IST]
Other articles published on Jul 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X