న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ వేదికపై భారత్ Vs పాకిస్థాన్: షెడ్యూల్ ఖరారు

By Nageshwara Rao
India to take on Pakistan in CWG opener

హైదరాబాద్: 2018 కామన్వెల్త్‌ క్రీడలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులైన భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తమ ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య షెడ్యూల్ విడుదల చేసింది.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత హాకీ జట్టు ఈ సారి పూల్‌ ఏలో ఉంది. గత కామన్వెల్త్‌లో రజతం సాధించిన భారత్‌తోపాటు పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, మలేసియా, వేల్స్‌ పూల్ ఏలో ఉన్నాయి.


Pool A
ఆస్ట్రేలియా
న్యూజిలాండ్
కెనడా
దక్షిణాఫ్రికా
స్కాట్లాండ్


Pool B
ఇండియా
ఇంగ్లాండ్
మలేసియా
పాకిస్థాన్
వేల్స్


ఇక, ఐదు సార్లు ఛాంపియన్‌‌గా నిలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, కెనడా, స్కాట్లాండ్‌ పూల్‌-బిలో ఉన్నాయి. టోర్నీలో భాగంగా ఏప్రిల్‌-7న పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. ఏప్రిల్ 8న వేల్స్‌, 10న మలేసియా, 11న ఇంగ్లాండ్‌తో భారత హాకీ జట్టు తలపడనుంది.

మరోవైపు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 6న మలేసియాతో తలపడుతుంది. గోల్డ్‌కోస్ట్‌ ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, భారత్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతాయి. ఈ మధ్య కాలంలో భారత హాకీ జట్లు అద్భుత ప్రధర్శన చేస్తున్న సంగతి తెలిసిందే.


Pool A
ఇంగ్లాండ్
ఇండియా
దక్షిణాఫ్రికా
మలేసియా
వేల్స్


Pool B
ఆస్ట్రేలియా
న్యూజిలాండ్
స్కాట్లాండ్
కెనడా
ఘనా

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 28, 2017, 14:21 [IST]
Other articles published on Nov 28, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X