న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపీఎల్ తరహాలో.. 'ఖో-ఖో' లీగ్‌ వచ్చేసింది

Indias first professional Kho-Kho league launched

బీసీసీఐ సంస్థ మొట్టమొదటగా క్రికెట్ ఆటకు సంబంధించి ఐపీఎల్ లీగ్‌ను తీసుకొచ్చింది. మొదటి సీజన్‌కు వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. ఆ సీజన్‌ అనంతరం ప్రతీ సంవత్సరానికి ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూనే వచ్చింది. దీంతో కరేబియన్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ లీగ్ ఇలా చాలానే పుట్టుకొచ్చాయి. ఇది చూసి ప్రో కబడ్డీ లీగ్‌ను తీసుకొచ్చారు. ఇది కూడా భారత అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరో లీగ్ కూడా భారత అభిమానుల ముందుకు వచ్చింది. అదే 'ఖో-ఖో' లీగ్‌.

అల్టిమేట్‌ ఖో-ఖో:
గ్రామీణ క్రీడ అయిన ఖో-ఖో లీగ్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలలో నిర్వహించనున్నట్లు భారత ఖో-ఖో సమాఖ్య (కేకేఎ్‌ఫఐ) మంగళవారం ప్రకటించింది. 'అల్టిమేట్‌ ఖో-ఖో' అని పేరు పెడుతూ.. 'లెట్స్‌ ఖో' అనే ట్యాగ్‌లైన్‌ జత చేశారు. భారత ఒలింపిక్‌ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ఖోఖో సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాజీవ్‌ మెహతా ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

21 రోజులు.. 60 మ్యాచ్‌లు:
ఐపీఎల్‌ తరహాలో 8 ఫ్రాంచైజీలు లీగ్‌లో పాల్గొనబోతున్నాయట. 8 ఫ్రాంచైజీ నగరాల్లో బెంగళూరు, పుణే ఉండటం దాదాపు ఖాయం కాగా.. ఇతర 6 జట్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ 8 ఫ్రాంచైజీలు రెండేసి సార్లు తలపడే అవకాశం ఉంది. లీగ్‌లో భాగంగా 21 రోజులలో డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్ధతిన 60 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో జట్టులో మొత్తం 12 మంది ఆటగాళ్లు ఉంటారు. అయితే ఇద్దరు విదేశీయులకు చోటుంటుంది. ఈ లీగ్‌లో భారత్‌తో పాటు దక్షిణ కొరియా, ఇరాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇంగ్లండ్‌ దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటారు.

Story first published: Wednesday, April 3, 2019, 12:07 [IST]
Other articles published on Apr 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X