న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాతీయ గీతాన్ని వీడియో రూపంలో ఆలపించిన క్రీడాకారులు

This video of National Anthem by Indian athletes

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా క్రీడాకారులంతా సామాజిక మాద్యమాల ద్వారా అభిమానులతో శుభాకాంక్షలు పంచుకున్నారు. అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు స్పాన్సర్‌గా వ్యవహరించే ఎడిల్‌వేస్‌ ఆర్థిక సంస్థ ఈ సందర్భంగా ఓ ఏర్పాటు చేసింది. క్రీడాకారులందరిచే ప్రత్యేకంగా జాతీయగీతాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థుల నినాదాలతో, దేశభక్తి గీతాలతో వీధులన్నీ మార్మోగాయి. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతికి సందేశం ఇచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ కార్యాలయాల వద్ద జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.

ఎంతో మంది సినీ కళాకారులు, వ్యాపార వేత్తలు స్వాత్వంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొని సంబంధిత వీడియోలను ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇదే తరహాలో అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు గెలిచి జాతీయ పతాకాన్ని ముద్దాడాలని, మువ్వన్నెల జెండాకు వందనం చేయాలనుకుంటున్న క్రీడాకారుల వీడియో ఒకటి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ సంస్థ క్రీడాకారులకు స్పాన్సర్‌ చేస్తోంది.

ఈ వీడియోలని వారంతా తమ క్రీడా విభాగాల్లో రాణిస్తూ గుర్తింపునకు నోచుకోని వారు కావడం గమనార్హం. వీరికి క్రికెటర్లంతా గుర్తింపు లేకున్నా అంతర్జాతీయ యవనికపై సత్తా చాటారు. పతకాలు సాధించారు. మరికొందరు సాధించాలన్న పట్టుదలతో ఉన్నవారు. ఆర్టిస్టిక్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన దీపా మాలిక్‌, షూటర్‌‌ హీనా సిద్ధూ, వాలీబాల్‌, బాక్సింగ్‌, జూడో, గోల్ఫ్‌ క్రీడాకారులు ఈ వీడియోలో తమ జాతీయ భావాన్ని చాటిచెప్పారు.

Story first published: Wednesday, August 15, 2018, 19:10 [IST]
Other articles published on Aug 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X