న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బలమైన శీతల గాలులు: పోటీలు నిలిపివేత, ఎదురుచూడాల్సిన పరిస్థితి

By Nageshwara Rao
High winds wreak havoc as Canada breezes to double gold

హైదరాబాద్: దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరంలో జరుగుతోన్న వింటర్‌ ఒలింపిక్స్‌లో సోమవారం నాటి పోటీలకు గాలులు అడ్డుగా నిలిచాయి. దీంతో వింటర్ ఒలింపిక్స్‌లో మరోసారి సత్తా చాటాలన్న ఉత్సాహంతో ఉన్న అమెరికా స్లాలోమ్‌ రేసర్ మిఖయేలా షిఫ్రిన్ బరిలోకి దిగేందుకు ఎదురుచూడక తప్పలేదు.

మరిన్ని వింటర్ ఒలింపిక్స్ వార్తల కోసం

మహిళల 'జెయింట్‌ స్లాలోమ్‌' ఈవెంట్‌లో సోమవారం ప్రారంభం కావాల్సి ఉండగా... గాలుల ఉధృతి కారణంగా ఈవెంట్‌ను గురువారానికి వాయిదా వేశారు. ఈ పోటీలు నిర్వహించే ఫీనిక్స్ ప్రీస్టయిల్ పార్క్ ప్రాంతమంతా దట్టమైన మంచుతో నిండిపోయి ఇబ్బందికరంగా మారింది.

మరోవైపు బలమైన శీతల గాలులు మరిన్ని సమస్యలను కొని తెస్తున్నాయి. దీంతో క్రీడాకారులు కనీసం ప్రాక్టీస్‌కు కూడా కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. -16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో స్లాలమ్ పోటీలను ప్రారంభించడం అసాధ్యమని అధికారులు నిర్ణయించారు.

వింటర్ ఒలింపిక్స్: బాబోయ్... 'ఇక ఫైనల్లో ఆడలేం'వింటర్ ఒలింపిక్స్: బాబోయ్... 'ఇక ఫైనల్లో ఆడలేం'

సెకనుకు 18 మీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నందున పోటీలను వాయిదా వేయక తప్పలేదని వింటర్ ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఓసీ) ప్రకటించింది. క్రీడాకారుల భద్రతే తమ ముఖ్యమని ఓసీ స్పష్టం చేసింది. మరోవైపు మహిళల స్లోప్‌స్టైల్‌ ఫైనల్‌ను బలమైన గాలుల మధ్య నిర్వహించడంపై స్నోబోర్డర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాలుల వల్ల పోటీని తాము సరిగా పూర్తి చేయలేమన్న ఆ అథ్లెట్లు.. ఇలాగే ఆడడం వల్ల ప్రమాదాల బారినపడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్లాలమ్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి రేసును మొదలు పెట్టాల్సిన షిఫ్రిన్ గురువారం వరకూ వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే సోమవారం జరిగిన పోటీల్లో టీమ్‌ ఫిగర్‌ స్కేటింగ్‌లో కెనడా స్వర్ణ పతకం గెలిచింది. ఈ ఒలింపిక్స్‌లో కెనడాకు ఇదే తొలి పసిడి కావడం విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 12:42 [IST]
Other articles published on Feb 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X