న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కౌంటీకి మేయర్‌గా WWE మాజీ ఛాంపియన్ కేన్

Glenn Jacobs, aka Kane of WWE, takes home Knox County mayoral race

హైదరాబాద్: 90ల్లో అతనొక సంచలనం.. సోదరుడితో పాటు బరిలోకి దిగారంటే ఎలాంటి వాడొచ్చినా చిత్తవ్వాల్సిందే.. క్రమేపీ ఫామ్ తగ్గినా.. తానేంటో సత్ా చాటేందుకు మళ్లీ మేయర్‌గా ముందుకొచ్చాడు. గ్లెన్ జాకబ్స్.. అలియాస్ కేన్ బ్రదర్ ఆఫ్ అండర్ టేకర్. ఆరు ఆడుగుల భారీ కాయంతో.. బరిలోకి దిగిన ప్రత్యర్థికి ముచ్చెమటలు పుట్టించే రెజ్లింగ్ సూపర్ స్టార్ అయిన కేన్‌.. ఇప్పుడతడు అమెరికాలోని ఓ కౌంటీకి మేయర్ అయ్యాడు. టెన్నెసీలోని మూడో అతిపెద్ద కౌంటీ అయిన నాక్స్‌విలె మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో కేన్ గెలిచాడు. రిపబ్లికన్ పార్టీకి చెందిన కేన్ డెమొక్రాట్ అభ్యర్థి లిండా హేనీపై భారీ మెజార్టీతో విజయం సాధించాడు.

కేన్ రెజ్లింగ్‌లో పార్టిసిపేట్ చేయడంతోపాటు ఓ ఇన్సూరెన్స్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా నడుపుతున్నాడు. గురువారం నాక్స్ కౌంటీలో ఈ ఓట్ల లెక్కింపు జరిగింది. మేలో జరిగిన ప్రైమరీలో అతి కష్టమ్మీద కేన్ గెలిచాడు. సెప్టెంబర్ 1న అతడు మేయర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నాడు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కేన్ మూడుసార్లు వరల్డ్ చాంపియన్ కాగా.. 12సార్లు ట్యాగ్ టీమ్ చాంపియన్‌షిప్ గెలిచాడు.

కేన్ ప్రస్తుత జనరేషన్‌కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. గానీ, 90ల్లో జరిగిన WWF, WWEలలో ఒక స్టార్ హోదాని దక్కించుకున్నాడు. అతనున్నాడంటే ప్రత్యర్థికి ముచ్చెమటలు పుట్టేవి. మేయర్‌గా గెలిచిన కేన్ అలియాస్.. జాకోబ్స్ గత 20ఏళ్లుగా అదే కౌంటీలో నివాసముంటున్నాడు. అతనికి డబ్ల్యూడబ్ల్యూఈతో పాటు లోకల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఉంది. ఈ వ్యాపారంతో పాటు డబ్ల్యూడబ్ల్యూఈలోనూ కనిపించే అండర్‌టేకర్ (మార్క్ కలవే) ఇతని సోదరుడే కాక భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు.

అయితే మేయర్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. కేన్ తన ప్రాంత ప్రజలనుద్దేశించి ప్రసంగించాడు. 'నేను మీలో ఒకడిని. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతా. ఎల్లవేళలా మీకు సహకారం అందిస్తా. ఓ ప్రొఫెషనల్ రెజ్లర్ మేయర్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. బౌట్‌లో ఉన్నప్పుడు బెల్ మోగేసరికి ఎవరు మెరుగ్గా ఉంటే వాళ్లే విజేతలు ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఎన్నికల్లో నేనే కరెక్ట్ అని వాళ్లు ఎంచుకున్నారు. నాకు ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, August 3, 2018, 13:09 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X