న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'2020 ఒలింపిక్సే లక్ష్యంగా... క్రీడాకారులకు సంపూర్ణ మద్దతు'

Funding for Asian Games, Commonwealth Games to continue despite focus on Olympics: Rajyavardhan Singh Rathore

హైదరాబాద్: టోక్యో వేదికగా 2020లో జరిగే ఒలింపిక్స్‌తోపాటు 2022 ఆసియా గేమ్స్, కామవెల్త్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులు పతకాలు సాధించే దిశగా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నాడు.

ఆసియా కప్: డ్రెస్సింగ్ రూమ్‌లో కేదార్ జాదవ్ డ్యాన్స్ (వీడియో)ఆసియా కప్: డ్రెస్సింగ్ రూమ్‌లో కేదార్ జాదవ్ డ్యాన్స్ (వీడియో)

ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆదివారం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు. ఈ సందర్భంగా రానున్న రెండేళ్ల కాలంలో జరిగే ఒలింపిక్స్‌పై క్రీడాకారులు దృష్టి సారించాలని, ఇందులో పతకాలు సాధించలేనివారు ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్‌లోనైనా పతకాలు సాధించే దిశగా ప్రయత్నించాలని అన్నాడు.

గతంలో పతకాలు సాధించని క్రీడాకారులకు నిధుల సమస్య ఎదురయ్యేదని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసియా గేమ్స్, కామనెవెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించే దిశగా క్రీడాకారులు తమ వంతు కృషి చేయాలని మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సూచించాడు.

పాక్‌పై సెంచరీ: ఓపెనర్‌గా 5000, రోహిత్ శర్మ ఖాతాలో అనేక రికార్డులుపాక్‌పై సెంచరీ: ఓపెనర్‌గా 5000, రోహిత్ శర్మ ఖాతాలో అనేక రికార్డులు

మరోవైపు క్రీడాకారులకు అవసరమైన నిధుల కోసం వివిధ కార్పొరేట్ కంపెనీలు, అభిరుచి కలిగిన సంస్థలు, వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నామని కూడా రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సందర్భంగా తెలిపాడు. క్రీడల్లో ఉత్తములుగా రాణించాలని, అందుకు తగిన ప్రోత్సాహం తమవైపు నుంచి ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి చెప్పాడు.

Story first published: Monday, September 24, 2018, 19:12 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X