న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లాష్ బ్యాక్ 2018: నీరజ్, హిమదాస్‌ల కెరీర్ మలుపుతిప్పిన ఏడాది

Flashback 2018: Breakthrough year for Neeraj, Hima but familiar dope shame hits Indian athletics

న్యూఢిల్లీ: ఈ ఏడాది క్రీడారంగంలో సరికొత్త అధ్యాయమే మొదలైందని చెప్పాలి. పేదరికం నుంచి వచ్చి ప్రపంచానికి సత్తా చాటిన స్ప్రింటర్ హిమదాస్.. తన రికార్డును తానే బద్దలు కొట్టిన నీరజ్ చోప్రా ఇలా 2018లో జరిగిన ఆసియా.. కామన్వెల్త్ క్రీడల్లో భారత జెండా రెపరెపలాడేలా చేశారు. 2016లో జూనియర్ వరల్డ్ రికార్డు పొందిన నీరజ్ చోప్రా.. కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణాన్ని గెలుచుకుని ఘనత సాధించాడు. మరోసారి రెండేళ్ల తర్వాత అవే ఈవెంట్లలో పాల్గొని తన రికార్డును తానే బద్దలు కొట్టాడు నీరజ్ చోప్రా. పానిపట్‌లోని ఖాండ్రా గ్రామంలో పుట్టిన నీరజ్.. ప్రపంచ రికార్డును ఈ ఏడాదిలో రెండు సార్లు బద్దలుకొట్టాడు.

 తన రికార్డును తానే.. నీరజ్ చోప్రా:

తన రికార్డును తానే.. నీరజ్ చోప్రా:

రెండేళ్ల క్రితం తాను సాధించిన రికార్డులను ఏ మాత్రం తీసిపోకుండా సాధించడమే కాకుండా వాటిని బద్ధలు కొట్టి 12 పాయింట్లతో డైమండ్ లీగ్ సిరీస్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇంత చిన్నవయస్సులోనే ప్రపంచ రికార్డులు సాధిస్తున్న నీరజ్ తర్వాతి లక్ష్యం 2020 టోక్యో గేమ్స్ అని తానే చెప్పుకొచ్చాడు. ప్రపంచ మాజీ రికార్డు హోల్డర్ అయినటువంటి ఉ హోన్ శిక్షణలో రాటుదేలిన నీరజ్ చోప్రా.. ప్రస్తుత సంవత్సర ప్రదర్శన ఆధారంగా ప్రపంచ ఆరో ర్యాంకు దక్కించుకున్నాడు.

రికార్డులు బద్దలుకొడుతున్న హిమదాస్:

రికార్డులు బద్దలుకొడుతున్న హిమదాస్:

నీరజ్ చోప్రా కంటే చిన్న వయస్సులోనే అస్సాంలోని దింగ్ గ్రామానికి చెందిన హిమదాస్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. సంవత్సరం పాటు ఆమె ప్రదర్శనలో పరిణిత తెచ్చుకుంటూ స్వర్ణాన్ని పట్టేసింది. ఆసియా గేమ్స్‌లో 400మీ. పరుగు పందెంను 50.79 సెకన్లలో ముగించిన హిమ సిల్వర్ మెడల్ సాధించింది. ఈ ప్రదర్శన అనంతరం ప్రపంచంలో 23వ ర్యాంకు దక్కించుకోవడంతో పాటు ఆసియాలో రెండో ర్యాంకు పొందారు. కేవలం ఇద్దరి యువ అథ్లెట్లు మాత్రమే కాకుండా మరో ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్ టోర్నీలో కాంస్యాన్ని గెలుచుకుని భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.

జాతీయ స్థాయి రికార్డు గ్రహీతలు:

జాతీయ స్థాయి రికార్డు గ్రహీతలు:

అంతర్జాతీయ టోర్నీల్లోనే కాకుండా దేశీవాలీ పోటీల్లో మెరిసిన విజేతలు గుర్తుండిపోయే ప్రదర్శన చేశారు. లెజెండరీ శ్రీరామ్‌ 42 ఏళ్ల రికార్డు అయిన 800మీ. 45.65 సెకన్లలో పూర్తి చేసి నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ద్యుతీ చంద్(మహిళల 100మీ), మొహ్మద్ అనాస్(పురుషుల 400మీ), జిన్సన్ జాన్సన్ (పురుషుల 1500మీ), మురళీ శ్రీశంకర్(పురుషుల లాంగ్ జంప్) విభాగాల్లో రాణించి జాతీయ రికార్డులను కొల్లగొట్టారు.

 ఏడాది మొత్తం పతకాల పంటే:

ఏడాది మొత్తం పతకాల పంటే:

మొత్తంగా భారత అథ్లెట్టు 19 పతకాలతో మెరిశారు. 1978వ సంవత్సరం తర్వాత జకార్తాలోని ఆసియా గేమ్స్‌లో ఏడు స్వర్ణాలు, 10 కాంస్యాలు, 2 రజితాలు గెలుచుకుని ఇప్పటివరకూ సాధించని అత్యుత్తమ ఫలితాలను సాధించారు. 2014 ఎడిషన్‌లో మెరిసినట్లుగానే గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018లో 1స్వర్ణం, 1 రజితం, 1 కాంస్యంతో మెప్పించారు భారత అథ్లెట్లు.

వీడని డోపింగ్‌ విచారం:

వీడని డోపింగ్‌ విచారం:

సీజన్ చివరి భాగంలో భారత అథ్లెట్లకు చేదు వార్తను మిగిల్చాయి. ఐదుగురు అథ్లెట్లను టోర్నీలో నుంచి తప్పించారు. ఇందులో ఆసియా ఛాంపియన్ క్వార్టర్ మిలర్‌లో నిర్మలా షెరాన్, సంజీవని యాదవ్, జూమా ఖాటన్, డిస్కస్ త్రోవర్ సందీప్ కుమారి, షాట్ పుటర్ నవీన్‌లు ప్రపంచ డోపింగ్ ఏజెన్సీ ముందు డోపింగ్‌కు పాల్పడిన వారిగా తేలడంతో నిషేదానికి లోనైయ్యారు.

అనూహ్యంగా వికాస్ గౌడ నిర్ణయం:

అనూహ్యంగా వికాస్ గౌడ నిర్ణయం:

భారత స్టార్‌ డిస్కస్‌ త్రోయర్‌ వికాస్‌ గౌడ అథ్లెట్లిక్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. గత పదిహేనేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిన 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండే వికాస్ గౌడ కామన్వెల్త్‌ క్రీడల్లో డిస్కస్‌ త్రోలో స్వర్ణం పతకం సాధించిన ఏకైక భారత ఆటగాడు. అంతేకాదు భారత్ తరుపున వరుసగా నాలుగు ఒలింపిక్స్‌ల్లో (2004, 2008, 2012, 2016) వహించాడు. స్వదేశంలో 2010లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం నెగ్గిన వికాస్ గౌడ 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

ఇక, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించడం అతడి అత్యుత్తమం. ఆసియా క్రీడల్లోనూ వికాస్‌ గౌడ రికార్డు గొప్పగానే ఉంది. 2013, 2015 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గాడు. 2010 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2014 ఆసియా క్రీడల్లో రజతం సొంతం చేసుకున్నాడు. డిస్కస్‌ త్రోలో జాతీయ రికార్డు (66.28 మీటర్లు) అతడి పేరిటే ఉంది. 2012లో ఆ రికార్డు సాధించాడు. గతేడాది భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన అనంతరం వికాస్‌, ప్రధాన ఈవెంట్లలో బరిలోకి దిగలేదు.

Story first published: Monday, December 24, 2018, 15:15 [IST]
Other articles published on Dec 24, 2018
Read in English: Flashback 2018: Athletics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X