న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డు బద్దలు కొట్టే ప్రయత్నంలో: ప్రపంచంలోనే 'పాస్టెస్ట్ ఉమెన్' చివరకు స్పీడ్‌తోనే పైలోకాలకు!

Fastest woman on four wheels Jessi Combs killed attempting to break her own land speed record

హైదరాబాద్: జెస్సీ కాంబ్స్... రేసింగ్ గురించి ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. అభిమానులు ముద్దుగా జెస్సీ కాంబ్స్‌ను పిలుచుకునే పేరు 'నాలుగు చక్రాలపై వేగవంతమైన మహిళ'. తన రికార్డుని అధిగమించే క్రమంలో బుధవారం ఆమె కారు యాక్సిడెంట్‌లో మరణించారు.

మరో అమ్మాయితో హార్దిక్‌ పాండ్యా డేటింగ్‌.. ఆమె ఎవరో తెలుసా?మరో అమ్మాయితో హార్దిక్‌ పాండ్యా డేటింగ్‌.. ఆమె ఎవరో తెలుసా?

జెస్సీ కాంబ్స్ జెట్ కారు అల్వోర్డ్ ఎడారిలో ప్రమాదానికి గురైనట్లు స్పాట్‌లోనే ఆమె మరణించినట్లు నార్ట్ వెస్ట్రన్ యుఎస్ స్టేట్ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. 39 ఏళ్ల జెస్సీ కాంబ్స్ 2013లో గంటకు 398 మైళ్లు(641 కిలోమీటర్ల) వేగంతో జెట్ కారుని నడపడంతో 'పాస్టెస్ట్ ఉమెన్' టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

గతంలో ఆమె నమోదు చేసిన ఈ రికార్డుని అధిగమించే క్రమంలో బుధవారం ఆమె జెట్ కారు ప్రమాదానికి గురికావడంతో స్పాట్‌లోనే ఆమె మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న నార్ట్ వెస్ట్రన్ యుఎస్ స్టేట్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అక్షర్‌ పటేల్‌ మెరుపు ఇన్నింగ్స్.. చాహల్‌ మాయ.. దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయంఅక్షర్‌ పటేల్‌ మెరుపు ఇన్నింగ్స్.. చాహల్‌ మాయ.. దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం

అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు హెన్రీ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నామని అందులో పేర్కొన్నారు. వివిధ యుఎస్ టెలివిజన్ షోలలో కూడా కనిపించిన జెస్సీ కాంబ్స్... గత అక్టోబర్లో తన రికార్డును బద్దలు కొట్టడానికి ప్రయత్నించింది.

యుఎస్ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం, ఆమె తన మునుపటి వేగాన్ని గంటకు 483 మైళ్ళకు చేరుకోగలిందని... అయితే జెట్ కారులో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆమె రికార్డుని అధిగమించినట్లు అధికారికంగా ధృవీకరించలేదు.

Story first published: Friday, August 30, 2019, 12:13 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X