న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిమ దాస్‌కు ఇంగ్లీషు రాదు: ఏఎఫ్‌ఐ ట్వీట్‌ వివాదాస్పదం, నెటిజన్ల ట్రోల్

By Nageshwara Rao
Fans troll AFI for referring to Hima Das lack of fluency in English

హైదరాబాద్: వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్‌ టైమింగ్‌తో భారత అథ్లెట్‌ హిమ దాస్‌ స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. ఫిన్లాండ్‌లోని టాంపెరె వేదికగా జరుగుతున్న ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం అందుకుంది.

అయితే ఈ విషయాన్ని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్‌ఐ) అభిమానులకు తెలియజేస్తూ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఆ ట్వీట్‌లో "గోల్డ్ మెడల్ సాధించిన అనంతరం హిమదాస్ మీడియాతో మట్లాడినప్పుడు అంతగా ఇంగ్లీష్‌లో మాట్లాడకున్నా.. మీడియాకు సరిగ్గానే సమాధానం ఇచ్చింది" అని ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌పై ఏఎఫ్‌ఐని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. "ఇంగ్లీష్ రానంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. కదా.. అది జస్ట్ కమ్యూనికేషన్ కోసం. కాని.. తను ఇండియా గర్వించేలా చేసింది. అది చాలు. తను చెప్పాలనుకున్నది చెప్పింది కదా" అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏఎఫ్‌ఐ మళ్లీ మరో ట్వీట్ చేసి వివరణ ఇచ్చింది.

ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌ హిమ దాసే కావడం విశేషం. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ దాస్ తన తాజా ప్రదర్శనతో దేశం గర్వించేలా చేసింది. దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదిక ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Saturday, July 14, 2018, 16:39 [IST]
Other articles published on Jul 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X