న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాజీ కెప్టెన్‌కు హెచ్‌ఐవీ.. సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని విజ్ఞప్తి!!

Ex-Wales rugby captain Gareth Thomas revealing HIV status will tackle stigma

హైదరాబాద్: వేల్స్‌కు చెందిన రగ్బీ జట్టు మాజీ కెప్టెన్‌ గారెత్‌ థామస్‌ తాను హెచ్‌ఐవీ పాజిటివ్ అని ప్రకటించాడు. శనివారం రాత్రి పోస్ట్ చేసిన ట్విట్టర్ వీడియోలో థామస్ తన హెచ్‌ఐవీ స్థితిని వెల్లడించాడు. హెచ్‌ఐవీ విషయంలో తనకు బెదిరింపు మెయిల్స్‌ వస్తున్నాయని, అందుకే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని ఆ వీడియోలో థామస్‌ పేర్కొన్నాడు.

<strong>ప్రొకబడ్డీ చరిత్రలో అత్యధిక ట్యాకిల్ పాయింట్లు.. పాట్నా 'హ్యాట్రిక్' నమోదు</strong>ప్రొకబడ్డీ చరిత్రలో అత్యధిక ట్యాకిల్ పాయింట్లు.. పాట్నా 'హ్యాట్రిక్' నమోదు

ఆత్మహత్య చేసుకోవాలనిపించింది:

ఆత్మహత్య చేసుకోవాలనిపించింది:

ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియోలో 45 ఏళ్ల గారెత్‌ థామస్‌ మాట్లాడుతూ.. 'చాలా ఏళ్ల పాటు ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నా. ఒక జట్టుకు బాధ్యతలు నిర్వర్తించా కాబట్టి ప్రజలు తన గురించి ఏమనుకుంటారోననే భయం, సిగ్గుతో ఇన్నేళ్లు ఈ రహస్యాన్ని బయటపెట్టలేదు. జీవితంపై అసహ్యం వేసింది. ఇక కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి' అని తెలిపాడు.

బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి:

బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి:

'హెచ్‌ఐవీ విషయంలో నాకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. నన్ను మానసికంగా బాదించారు. అందుకే స్వయంగా నేనే ఈ విషయాన్ని అందరితో చెప్పాలనుకున్నా. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నా. హెచ్‌ఐవీ ఉన్నందున తనను సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దు. ఈ విషయంలో తనకు అండగా నిలవాలి' అని గారెత్‌ థామస్‌ కోరాడు.

నిరంతరం పోరాటం చేస్తా:

'ఈ వ్యాధి పట్ల నిరంతరం పోరాటం చేస్తా. హెచ్‌ఐవీపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తా' అని థామస్‌ పేర్కొన్నాడు. థామస్‌ పోస్టు చేసిన వీడియోకి పలువురు నుంచి ప్రశంసలతో పాటు అభినందనలు అందుతున్నాయి. థామస్‌ 1995 నుంచి 2007 వరకు వేల్స్‌ రగ్బీ జట్టు తరఫున 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

Story first published: Monday, September 16, 2019, 9:15 [IST]
Other articles published on Sep 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X