న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రికెట్లో హైదరాబాదీ రికార్డ్ బద్దలు: స్టన్ 138 బంతుల్లో 350 రన్స్

By Srinivas

ప్రపంచ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డ్. ఇంగ్లాండ్‌లో ల్యాంక్ షైర్, క్లాడీ జట్ల మధ్య ఒక రోజు క్రికెట్ పోటీలు జరిగాయి ఈ పోటీల్లో ల్యాంక్ షైర్ ఆటగాడు లియాన్ లివింగ్ స్టన్ 138 బంతుల్లో ఏకంగా 350 పరుగులు చేశాడు. దీంతో 45 ఓవర్లకు ల్యాంక్ షైర్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 579 పరుగులు చేసింది.

లియాన్ లివింగ్ స్టన్ కొట్టిన చేసిన 350 పరుగుల్లో 34 ఫోర్లు, 27 సిక్స్‌లు ఉన్నాయి. ఏ ఫార్మాట్‌లో అయినా ఒకరోజు క్రికెట్ పోటీల్లో వ్యక్తిగత అత్యుత్తమ రికార్డ్ ఇది. గతంలో ఈ రికార్డ్ హైదరాబాద్ కుర్రాడు నిఖిలేష్ సుందరేశన్ పేరిట ఉంది.

Liam Livingstone

2008లో జరిగిన ఓ స్కూల్ మ్యాచ్‌లో అతను తన పదిహేనేళ్ల వయస్సులో 334 పరుగులు చేశాడు. ఇప్పుడు లివింగ్ స్టన్ ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

ఆ తర్వాత ప్రతి బాల్ సిక్స్ కొట్టాలని చూశా: లివింగ్ స్టాన్

తన సెంచరీ అనంతరం తాను ప్రతి బంతిని సిక్స్‌గా మలచాలని చూశానని లివింగ్ స్టన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. తాను డబుల్ సెంచరీ, ఆ తర్వాత ట్రిపుల్ సెంచరీ దాటుతున్న సమయాల్లో.. ఏదో ప్రత్యేకత ఉంటుందని భావించానని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X