న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నన్ను తేడాగా చూసినా.. గే అన్నా పట్టించుకోను: ద్యుతీ చంద్

Dutee Chand Says People Look At Me And My Partner Differently, But It Doesnt Matter

న్యూఢిల్లీ: గతేడాది తాను స్వలింగ సంబంధంలో ఉన్నానంటూ భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ సంచలన ప్రకటన విషయం తెలిసిందే. ఒడిశాలోని తన సొంత గ్రామానికి(చక్ర గోపాల్‌పుర) చెందిన సమీప బంధువైన అమ్మాయితో కలిసి జీవిస్తానని కూడా ప్రకటించింది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించారు. అయినా ఏమాత్రం వెనకడుగు వేయని ద్యుతీ.. ఆ అమ్మాయితో కలిసి ఉంటుంది.

అయితే తాను స్వలింగ సంపర్కరాలినని ప్రకటించుకున్న తర్వాత అందరూ తనవైపు అదోలా చూస్తున్నారని ఈ భారత స్టార్‌ స్ప్రింటర్ తాజాగా వ్యాఖ్యానించింది.
కానీ, ఆ చూపులు తనను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేవని పేర్కొంది. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్‌తో ఆల్‌లైన్‌ ముచ్చట సందర్భంగా ద్యుతీ చెప్పింది. తనలాంటి వారు ధైర్యంగా బయటకు రావాలని కోరింది.

'నా భాగస్వామి ఎప్పుడూ నాకు మద్దతుగా నిలుస్తుంది. జీవితాంతం ఆమెతోనే ఉండాలనుకుంటున్నా. ఏదో తేడాగా చూసినా.. గే, లెస్బియన్‌ అని అన్నా పట్టించుకోను. నాలాంటి వారంత ధైర్యంగా ముందుకురండి. ఎవరికి భయపడవద్దు. ఇది మీ జీవితం.. మీ సంతోషం. ఈ సమాజం ఏ విషయాన్నైనా నెమ్మదిగా స్వీకరిస్తుంది'అని ద్యుతీ పేర్కొంది.

స్వలింగ్ వివాహాలు ఇప్పటికీ భారతదేశంలో చట్టబద్దం కాదు. కానీ గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు స్వలింగ సంబంధాలకు చట్టవిరుద్ధం కాదని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వపు హక్కును హరిస్తున్న సెక్షన్‌ 377పై పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

'వివో'పై తొందరెందుకు.. చైనా కంపెనీ స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐ'వివో'పై తొందరెందుకు.. చైనా కంపెనీ స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐ

Story first published: Thursday, July 2, 2020, 11:53 [IST]
Other articles published on Jul 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X