భర్త నొచ్చుకున్నా పర్వాలేదు..ఈ విషయం చెప్పాల్సిందే: కార్తీక్ భార్య

Posted By:
Dipika Pallikal looks to hit cricket for six

హైదరాబాద్: దీపికా పల్లికల్ భారతదేశానికి చెందిన ప్రముఖ స్క్వాష్ ప్లేయర్. క్రితం సారి జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొని స్వర్ణాన్ని సైతం సాధించింది. ఆమె చెప్పాలనుకుంటోన్న సంగతి ఏంటంటే తనకు వ్యక్తిగతంగా గుర్తింపు దొరకట్లేదని.. ఇప్పటికీ తనను ఓ క్రికెటర్ కి భార్యగానే చూస్తున్నారు. కానీ, ఓ స్క్వాష్ ప్లేయర్‌గా గుర్తించట్లేదని చెప్పారు.

స్క్వాష్‌కు ఆదరణ:

ఈ సందర్భంగా దినేశ్ కార్తీక్ భార్య అయిన దీపికా పల్లికల్ క్రికెట్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేసింది. 'స్వాష్ ప్లేయర్ నాకు క్రికెట్ అంటే అస్సలు నచ్చదు. క్రికెట్ కారణంగానే దేశంలో ఇతర క్రీడలు ఆదరణ పొందడం లేదు' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ అంటే పడి చచ్చేంత పిచ్చి ఉన్న మనదేశంలో స్క్వాష్‌కు ఆదరణ అంతంత మాత్రమే.

క్రికెట్‌కు మించి ఆదరణను స్క్వాష్:

అయితే కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధిస్తే.. క్రికెట్‌కు మించి ఆదరణను స్క్వాష్ పొందుతుందనే ఆశాభావాన్ని దీపిక వ్యక్తం చేసింది. మా ఆయన నొచ్చుకున్నా ఫర్వాలేదు కానీ.. ఆదరణలో ఇతర క్రీడలు క్రికెట్‌ను వెనక్కి నెట్టాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

కార్తీక్‌తో సమానంగా గుర్తింపు దక్కాలి:

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'కార్తీక్, నేను ఇద్దరం అథ్లెట్లమే. తనతో సమానంగా నాకు కూడా గుర్తింపు దక్కాలి. కానీ క్రికెటర్లకే ఎక్కువ గుర్తింపు లభిస్తోందని దీపిక తెలిపింది. 2015లో దినేశ్ కార్తీక్‌ను పెళ్లాడిన ఈ స్క్వాష్ ప్లేయర్.. తన భర్త ఆడే క్రికెట్ మ్యాచ్‌లను కూడా చూడనని చెప్పింది. తాను క్రికెటర్ భార్య కావడం వల్లే మీడియా తనను గుర్తిస్తోందని చెప్పుకొచ్చింది.

జోష్న చినప్పతో కలిసి డబుల్స్‌లో:

జోష్న చినప్పతో కలిసి డబుల్స్‌లో:

నాలుగేళ్ల క్రితం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో దీపిక తన భాగస్వామి జోష్న చినప్పతో కలిసి డబుల్స్‌లో స్వర్ణం సాధించింది. స్క్వాష్‌లో భారత్ సాధించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. బుధవారం ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకం తేవడం కోసం శక్తి మేర ప్రయత్నిస్తానని దీపికా పల్లికల్ చెప్పింది.

Story first published: Wednesday, April 4, 2018, 15:16 [IST]
Other articles published on Apr 4, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి