
సైనా తుది ఎనిమిది జాబితాలో:
మరో మ్యాచ్‌లో ప్రత్యర్థి రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరగడంతో సైనా తుది ఎనిమిది జాబితాలో చేరింది. తొలిగేమ్‌లో 21-4తేడాతో గెలిచిన సైనా రెండోగేమ్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతుండగా ప్రత్యర్థి జెస్సికా లీ కాలిమడమగాయంతో వైదొలిగింది. కాగా, యువ రుత్వికా గద్దె కూడా 21-18,21-11తో వరుసగేముల్లో విజయంతో క్వార్టర్స్ చేరింది.

హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్‌కు:
పురుషుల సింగిల్స్‌లో శ్రీలంకకు చెందిన నుమెరో యునోపై 21-10 21-10తో ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్ విజయం సాధించగా.. 21-18 21-11 స్కోరుతో ఆస్ట్రేలియాకు చెందిన ఆంటోనీ జోపై విజయంతో హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు.

మిక్స్‌డ్ డబుల్స్ జోడీలు కూడా రౌండ్-8కు:
మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప-సాత్విక్ సాయిరాజ్ జోడీ, సిక్కిరెడ్డి-ప్రణవ్, డబుల్స్‌లో అశ్విని-సిక్కిరెడ్డి జోడీలు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఇక మహిళల డబుల్స్‌లోనూ సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీ తుది ఎనిమిది జాబితాలో చేరింది. వీరితోపాటు హెచ్‌ఎస్ ప్రణయ్, రుత్వికా శివానీ, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ జోడీలు కూడా రౌండ్-8కు చేరుకున్నారు.

మహిళల టేబుల్ టెన్నిస్‌లో:
శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో మనిక బాత్రా, మౌమా దాస్‌ల జోడి టియాన్వీ ఫెంగ్ ,మెంగువు యు( సింగఫూర్) ద్వయం చేతిలో పరాజయం పొందడంతో రజత పతకం సొంతమైంది.

బాక్సింగ్‌లోనూ రజిత, కాంస్యాలతో..
పురుషుల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణం కోసం పోటీపడ్డ భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ స్టీవెన్ డానెల్లీ( ఇంగ్లండ్) చేతిలో ఓడటంతో రజత పతకం దక్కింది. పురుషుల బాక్సింగ్ 69 కేజీల విభాగం సెమీ ఫైనల్లో మనోజ్‌కుమార్ ప్యాట్ మెక్‌కార్మాక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోవడంతో కాంస్యం చేజిక్కింది.

హాకీ అమ్మాయిల పరాజయం
మహిళల హాకీలో భారత జట్టు సెమీస్‌లో ఓటమి చవిచూసింది. డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియాతో పోరులో భారత్ 0-1తో ఓడింది. చివరి నిమిషాల్లో లభించిన రెండు సువర్ణావకాశాలను చేజార్చుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది.