వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌ పతకాల పరంపర 5

Posted By:
CWG 2018: Punam claims 5th gold for India; Vikas settles for bronze

హైదరాబాద్: కామన్వెల్త్‌లో భారత్ పతకాలతో దూసుకెళ్తుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌‌కోస్ట్ వేదికగా జరుగుతోన్న 21 వ కామన్వెల్త్ క్రీడల్లో ఇండియన్ వెయిట్‌లిఫ్టర్ల రికార్డు స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. శనివారం ఇదే విభాగంలో రెండు స్వర్ణాలు గెలిచిన లిఫ్టర్లు, ఆదివారం కూడా మరో స్వర్ణాన్ని చేజిక్కించుకున్నారు. మహిళల 69 కిలోల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణం గెలుపొందింది.

2014 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలుపొందిన పూనమ్ యాదవ్, ఈ సారి మాత్రం బంగారు పతకాన్ని ఒడిసిపట్టింది. స్నాచ్‌లో 100 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 122 కిలోల బరువు ఎత్తిన పూనమ్, మొత్తం 222 కిలోలతో పసిడి సొంతం చేసుకునింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఇంగ్లాండ్, ఫిజీ వెయిట్‌లిఫ్టర్లను వెనక్కు నెట్టిన పూనమ్ యాదవ్, భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకాన్ని చేర్చింది.

క్లీన్ అండ్ జర్క్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన సారా డేవీస్, ఫిజీకి చెందిన అపోలినియా వైవైల నుంచి పూనమ్ గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఈ రౌండులో వైవై 116 కిలోల బరువు ఎత్తడంతో పూనమ్ యాదవ్‌కు 118 కిలోల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ బరువును అవలీలగా పూనమ్ ఎత్తేయడంతో భారత లిఫ్టర్ తొలిస్థానంలో నిలిచారు. అనంతరం ఇంగ్లాండ్ లిఫ్టర్ సారా 119 కిలోల బరువు ఎత్తడంతో ఉత్కంఠత నెలకొంది.

ఫిజీ లిఫ్టర్ ఈ బరువును ఎత్తడంలో విఫలమవ్వడంతో ఆమె కాంస్యానికే పరిమితమైంది. ఇదే సమయంలో భారత లిఫ్టర్ పూనమ్ తనకు నిర్దేశించిన 122 కిలోల బరువు ఎత్తి సారాను వెనక్కు నెట్టారు. తర్వాత తనకు నిర్దేశించిన 128 కిలోల బరువును ఎత్తడంలో ఇంగ్లాండ్ లిఫ్టర్ విఫలమవ్వడంతో పూనమ్‌ను స్వర్ణం వరించింది. స్నాచ్‌లో 95, 98, 100 కిలోలతో తొలిస్థానంలో నిలిచిన పూనమ్, క్లీన్ అండ్ జర్క్‌ పోటీల్లో వరుసగా 118, 122 కిలోల బరువును ఎత్తి మొత్తం 222 కిలోలతో స్వర్ణం గెలుపొందారు.

Story first published: Sunday, April 8, 2018, 15:07 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి