కామన్వెల్త్ గేమ్స్: కాంస్య పతకంతో మెరిసిన పవర్ పారాలిఫ్టర్

Posted By:
CWG 2018: Power para-lifter Sachin Chaudhary claims bronze

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా మంగళవారం పారా అథ్లెటిక్ విభాగంలో భారత్ బోణీ చేసింది. పారా పవర్ లిఫ్టర్ సచిన్ చౌధరీ కాంస్య పతకం సాధించాడు.

పారా అథ్లెటిక్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్‌లో సచిన్‌తోపాటు మరో ముగ్గురు భారత పారా పవర్ లిఫ్టర్లు ఫైనల్ చేరగా 181 పాయింట్లతో సచిన్ చౌధరీ మూడో స్థానంలో నిలిచాడు. నైజీరియాకు చెందిన అబ్దులాజీజ్ ఇబ్రహీం స్వర్ణం సాధించగా, మలేసియాకు చెందిన యీఖే జోంగ్ రజతం సాధించాడు.

తాజా పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 21కి చేరింది. 35 ఏళ్ల సచిన్ చౌధరీ గతేదాది దుబాయిలో జరిగిన పవర్‌లిఫ్టింగ్ వరల్డ్ కప్‌లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. 2012లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్‌లోనూ అతడు భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Tuesday, April 10, 2018, 18:01 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి