కామన్వెల్త్ గేమ్స్‌లో నిరాశకు గురైన ట్రాన్స్‌జెండర్

Posted By:
CWG 2018: First transgender competitor withdraws in tears after injury

హైదరాబాద్: కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ ట్రాన్స్‌జెండర్‌ లారెల్‌ హుబ్బా ర్డ్‌.. తీవ్ర బాధతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌కు చెందిన ఈ 40 ఏళ్ల లిఫ్టర్‌ మహిళల ప్లస్‌ 90 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు సిద్ధమైంది. స్నాచ్‌లో మూడో ప్రయత్నం సందర్భంగా ఆమె తడబడి విఫలమైంది. బార్‌ను ఎత్తే ప్రయత్నంలో గాయపడ్డ ఆమె కంటతడి పెట్టుకొని పోటీ నుంచి వైదొలిగింది.

మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 90+ కిలోల బరిలోకి దిగిన హుబ్బార్డ్‌.. బరువు ఎత్తే సమయంలో భుజం కీలు జారడంతో నొప్పితో విలవిల్లాడి పోయింది. 30ఏళ్ల వయసులో హుబ్బార్డ్‌ సెక్స్‌ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకుని మహిళగా మారాడు. అయితే హుబ్బార్డ్‌ పోటీల్లో పాల్గొనడంపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేసినా.. నిర్వాహకులు ఆమెకు అనుమతినిచ్చారు.

లారెల్‌ మొదట పురుషుడు. పేరు గెవిన్‌ హబ్బర్డ్‌. పదేళ్ల క్రితం 30 సంవత్సరాల వయసులో లింగమార్పిడి చేయించుకొని అతను ఆమెగా మారాడు. వెయిట్‌లిఫ్టింగ్‌ అంటే ఎంతో ఇష్టమైన హబ్బర్డ్‌ కామన్వెల్త్‌ కోసం ఎంతో పట్టుదలగా సన్నద్ధమైంది. అయితే ఇతర దేశాలకు చెందిన లిఫ్టర్లు, కోచ్‌లు ఆమె ఇప్పుడు మహిళగా మారినప్పటికీ పూర్వమున్న పురుషుల బలం అంతర్గతంగా ఉండనే ఉంటుందని విమర్శించారు.

హబ్బర్డ్‌ను మహిళల ఈవెంట్‌లో పాల్గొనేందుకు అనుమతించడం సహేతుకం కాదని సమోవా లిఫ్టింగ్‌ జట్టు హెడ్‌ కోచ్‌ జెర్రీ వాల్‌వర్క్‌ నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. అయితే తాను మాత్రం ఇలాంటి విమర్శలను పట్టించుకోనని లారెల్‌ హబ్బర్డ్‌ చెప్పింది.

Story first published: Tuesday, April 10, 2018, 8:33 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి