న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్వెల్త్ గేమ్స్ 2018: ఆశలన్నీ యువ షూటర్లపైనే! (ఫోటోలు)

By Nageshwara Rao
CWG 2018: Balanced squad of veterans and young guns makes shooting India’s best medal bet

హైదరాబాద్: షూటింగ్‌లో రాణించాలంటే ఏకాగ్రత అవసరం.. గురి తప్పడానికి రెప్పపాటు చాలు.. కొద్దిగా తడబడితే పతకం కోల్పోవాల్సిందే. అంతేకాదు గాలి వీచే దశ షూటర్ భవిష్యత్‌ను కూడా మార్చే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ లక్ష్యం వైపే మన చూపు ఉండాలి. అంతకు మించిన ఆత్మవిశ్వాసంతో రాణిస్తేనే పతకం సాధిస్తాం లేదంటే లేదు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ఏప్రిల్ 8 నుంచి 14 వరకు బెల్‌మోంట్ షూటింగ్ కాంప్లెక్స్‌లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో భారత్ తరుపున మను భాకర్, మెహులీ ఘోష్, అనిష్ బాన్వాలా, అంజుమ్ మౌద్గిల్‌లాంటి యువ షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఇటీవల మెక్సికో వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశారు. ఈ వరల్డ్ కప్‌లో ఎవరూ ఊహించని రీతిలో 4 స్వర్ణాలతో కలిపి మొత్తం 9 పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అటు అనుభవంతో పాటు ఇటు యువకుల కలయికతో కూడిన పటిష్టమైన జట్టుని భారత్ బరిలోకి దింపుతోంది.

నిజానికి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణం గెలువడంతో భారత షూటింగ్‌లో సరికొత్త చరిత్ర ప్రారంభమైంది. బింద్రాని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించారు. భారత్‌కు కచ్చితంగా పతకం లభించే క్రీడ అంటే షూటింగ్ అనేలా యువ షూటర్లు రాణిస్తుండడం భవిష్యత్‌పై ఆశలు పెంచుతోంది.

ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ రూపంలో యువ షూటర్లు మరో చరిత్ర సృష్టించేందుకు మరో అద్భుత అవకాశం వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకం అందించే వారిలో ముఖ్యంగా వినిపిస్తోన్న పేర్లు అంజుమ్ మౌద్గిల్, మను భాకర్, మెహులీ ఘోష్‌, అనిశ్ భన్వాలా. వీరి గురించి తెలుసుకుందాం.

అంజుమ్ మౌద్గిల్

అంజుమ్ మౌద్గిల్

పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల అంజుమ్ మౌద్గిల్ భారత షూటింగ్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతోంది. కామన్వెల్త్ షూటింగ్ జట్టులో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్లు(3 పొజిషన్), 50 మీటర్ల (ప్రోన్) విభాగాల్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తోంది. 2010 నుంచి షూటింగ్‌లో అద్భుత విజయాలను సాధిస్తోంది. ఇటీవల మెక్సికోలో ముగిసిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో రజతం సాధించింది. విపరీతమైన పెనుగాలులతో ఇబ్బంది ఎదురైనా 50 మీ(3 పొజిషన్) రైఫిల్ ఈవెంట్‌లో పతకం సాధించడంతోపాటు.. తొలిసీజన్ వరల్డ్ కప్ పతకాలపట్టికలో మనకు తొలిస్థానం దక్కడంలో అంజుమ్ కీలకపాత్ర పోషించింది.

మను భకర్

మను భకర్

హర్యానాలోని జాహజ్జర్‌కు చెందిన మను భకర్ ఇప్పుడు భారత షూటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న యువ క్రీడాకారిణి. 16 ఏళ్ల మను భకర్ తన అంతర్జాతీయ అరంగేట్రంలోనే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణంతో మెరిసింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఓం ప్రకాశ్ మిత్రాల్‌తో కలిసి మరో పసిడిని సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడంపై మను భకర్ మాట్లాడుతూ 'మెక్సికోలో రెండు స్వర్ణాలు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఇదే మొదటి ప్రపంచకప్. రాబోయే టోర్నీలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నా' అని మను పేర్కొంది. తిరువనంతపురంలో జరిగిన నేషనల్స్‌లో ఈ అమ్మాయి 9 స్వర్ణాలతో కలిపి మొత్తం 15 పతకాలు సొంతం చేసుకుంది.

మెహులీ ఘోష్‌

మెహులీ ఘోష్‌

షూటింగ్ నేర్చుకుంటున్న దశలో బెంగాల్‌లోని శ్రీరాంపూర్ రైఫిల్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన మెహులీ ఓసారి మిస్‌ఫైర్ చేసింది. చిన్న కుగ్రామం నుంచి వచ్చిన మెహులీ కోల్‌కతాలోని కర్మాకర్ అకాడమీలో చేరిన తర్వాత ఈమె ప్రతిభ జాతీయస్థాయిలో మార్మోగింది. ప్రతి రోజు లోకల్ ట్రైన్‌లో నాలుగు గంటలు ప్రయాణం చేసి మరి శిక్షణ తీసుకుంది. గుడలాజారియాలో జరిగిన ఓ టోర్నీలో రెండు కాంస్యాలు గెలిచిన తర్వాత షూటింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 2016 నేషనల్స్‌లో రెండు పతకాలు.. 2017లో ఏకంగా 8 పతకాలు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. జపాన్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో యూత్ కేటగిరీలో స్వర్ణం పతకం సాధించింది.

అనిశ్ భన్వాలా

అనిశ్ భన్వాలా

హర్యానాకు చెందిన 15 ఏళ్ల అనిశ్ భన్వాలా సంచలన విజయాలతో భారత షూటింగ్ ఆశా కిరణంగా మారాడు. గతేడాది జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్ షూటింగ్‌లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డుతో సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. ఒలింపియన్ గురుప్రీత్‌సింగ్ ఇతర సీనియర్ షూటర్లు పాల్గొన్న జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించాడు. మెక్సికోలో ముగిసిన ప్రపంచకప్ షూటింగ్ ఈవెంట్‌లోనూ అద్భుతంగా రాణించి ఆకట్టుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత షూటర్ల బృందంలో చోటు దక్కించుకున్నాడు.

షూటింగ్‌లో 30 ఈవెంట్లలో పాల్గొంటోన్న భారత్

షూటింగ్‌లో 30 ఈవెంట్లలో పాల్గొంటోన్న భారత్

కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు చాలా దేశాలు ఆసక్తిని తగ్గించుకోవడంతో షూటింగ్‌లో భారత్ 27 అంశాలకు బదులుగా 30 ఈవెంట్లలో పాల్గొంటొంది. 15 మంది పురుషులు, 12 మంది మహిళల బృందంతో భారత్ షూటింగ్ బరిలోకి దిగుతుంది.

భారత జట్టు:

పురుషులు (15):

* 50m Rifle 3 Position: Sanjeev Rajput, Chain Singh

* 50m Rifle Prone: Chain Singh, Gagan Narang

* 10m Air Rifle: Ravi Kumar, Deepak Kumar

* 25m Rapid Fire Pistol: Anish, Neeraj Kumar

* 50m Free Pistol: Jitu Rai, Om Prakash Mitharwal

* 10m Air Pistol: Jitu Rai, Om Prakash Mitharwal

Trap: Manavjit Singh Sandhu, Kynan Chenai

Double Trap: Mohd Asab, Ankur Mittal

Skeet: Smit Singh, Sheeraj Sheikh

మహిళలు (12):

* 50m Rifle 3 Position: Anjum Moudgil, Tejaswini Sawant

* 50m Rifle Prone: Anjum Moudgil, Tejaswini Sawant

* 10m Air Rifle: Apurvi Chandela, Mehuli Ghosh

* 25m Sports Pistol: Heena Sidhu, Annuraj Singh

* 10m Air Pistol: Heena Sidhu, Manu Bhaker

Trap: Shreyasi Singh, Seema Tomar

Double Trap: Shreyasi Singh, Varsha Varman

Skeet: Saniya Sheikh, Maheshwari Chauhan.

Story first published: Friday, March 23, 2018, 11:47 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X