Commonwealth games 2022 : లాంగ్ జంప్లో తొలి పతకాన్ని అందించిన శ్రీశంకర్.. స్వర్ణం జస్ట్ మిస్

Commonwealth games : Indias First ever Medal in Long Jump Event Achieved by Murali Srishankar
Pakistan Cricket Team is Better Than India - Rashid Latif *Cricket | Telugu OneIndia

కామన్వెల్త్ గేమ్స్ 2022లో 7వ రోజు భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. లేట్ నైట్ జరిగిన ఈవెంట్లో ఈ పతకాలొచ్చాయి. ఇందులో ఓ స్వర్ణం, ఓ రజతం ఉండడం విశేషం. బుధవారం హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్యం సాధించి తొలిసారి హైజంప్లో భారత్‌కు మెడల్ అందించిన ప్లేయర్‌గా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక గురువారం కూడా అదే రీతిలో మెన్స్ లాంగ్‌ జంప్‌ ఫైనల్లో ఇండియన్ అథ్లెట్‌ శ్రీశంకర్‌ మురళీ అబ్బురపరిచే ప్రదర్శన కనబర్చాడు. జస్ట్ త్రుటిలో స్వర్ణాన్ని మిస్ చేసుకున్న శంకర్.. రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ క్రీడా చరిత్రలో లాంగ్ జంప్‌ విభాగంలో తొలిసారి భారత్‌కు మురళీ పతకాన్ని అందించి సగర్వంగా నిలిచాడు.

అందువల్లే స్వర్ణం రాలేదు

గురువారం రాత్రి 2.00 గంటలకు లాంగ్‌ జంప్‌ ఫైనల్ ఈవెంట్ జరిగింది. ఇకపోతే తన ఐదో ప్రయత్నంలో 8.08మీటర్ల మేర అతను దూకాడు. బహమాస్‌కు చెందిన లకాన్‌ నైర్న్‌ కూడా 8.08మీటర్లే దూకాడు. అతనికి గోల్డ్ మెడల్ రాగా.. మురళీకి రజతం వచ్చింది. దీనికి కారణం ఉంది. లకాన్‌ నైర్న్ తన ప్రయత్నాల్లో రెండో ఉత్తమ ప్రదర్శన 7.98 మీటర్లుగా కనబరిచాడు. శ్రీశంకర్‌ రెండో ఉత్తమ ప్రదర్శన 7.84 మీటర్లు. అందువల్ల స్వర్ణం మిస్సయింది. ఇక జమైకా అథ్లెట్ థాంప్సన్‌ 8.05మీటర్లు దూకి బ్రాంజ్ మెడల్ పొందాడు.

అపెండిసైటిస్ సమస్యతో పోయిన సారి దూరం

కేరళకు చెందిన 23ఏళ్ల శ్రీశంకర్‌‌‌ను గతంలో బ్యాడ్ లక్ వెంటాడింది. 2018కామన్‌వెల్త్‌ క్రీడలకు కూడా అతను ఎంపికయ్యాడు. అయితే గేమ్స్‌కు ముందు అనూహ్యంగా అపెండిసైటిస్ వచ్చింది. దీంతో ఆపరేషన్ నిమిత్తం అతను కామన్ వెల్త్ గేమ్స్‌కు మిస్సయ్యాడు. ఇక ఆపరేషన్ అనంతరం తన సాధనను మెరుగుపర్చుకుంటూనే ఉన్నాడు. ఈసారి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొని రజత పతకాన్ని దేశానికి అందించి వాహ్వా అనిపించాడు. అతనికి నెట్టింటా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కామన్వెల్త్ గేమ్స్ 2022 విజేతలు..

వెయిట్ లిఫ్టింగ్...

1. మీరాబాయి చాను (స్వర్ణం)

2. జెరెమి లాల్రినుంగ (స్వర్ణం)

3. అచింత షెవులి (స్వర్ణం)

4. బింద్యారాణి దేవి (రజతం)

5. సంకేత్ సర్గర్ (రజతం)

6. వికాస్ ఠాకూర్ (రజతం)

7. గురురాజ పూజారి (కాంస్యం)

8. హర్జీందర్ కౌర్ (కాంస్యం)

9. లవ్‌ప్రీత్ సింగ్ (కాంస్యం)

10. గుప్రీత్ సింగ్(కాంస్యం)

జూడో..

11. సుశీల లిక్మాబమ్ (సిల్వర్)

12. విజయ్ యాదవ్ (కాంస్యం)

13. తులిక్ మన్ (సిల్వర్)

లాన్ బౌల్స్

14. రూపా/లవ్లీ/నయాన్మోని/పింకి (స్వర్ణం)

టేబుల్ టెన్నిస్

15. శరత్/హర్మీత్/సాతియన్/సనిల్ (స్వర్ణం)

బ్యాడ్మింటన్

16. టీమిండియా (సిల్వర్)

స్క్వాష్

17. సౌరవ్ గోషల్ (కాంస్యం)

ట్రాక్ అండ్ ఫీల్డ్

18. తేజస్విన్ శంకర్ (కాంస్యం)

పవర్ లిఫ్టింగ్

19. సుధీర్ (స్వర్ణం)

లాంగ్ జంప్

20. శ్రీశంకర్ మురళీ (రజతం)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, August 5, 2022, 8:55 [IST]
Other articles published on Aug 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X