న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పతకాలపై కర్చీఫ్ వేసుక్కూర్చున్న భారత్

 Commonwealth Games 2022: India eyes gold in these categories including weightlifting

బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో పతకాల పంట పండించడానికి భారత్‌కు అద్భుతమైన అవకాశం ఉందివ్వాళ. కీలకమైన ఈవెంట్లల్లో భారత క్రీడాకారులు పాల్గొనబోతోన్నారు. తొలిరోజే అద్దిరిపోయేలా బోణీ కొట్టింది భారత్. బ్యాడ్మింటన్‌ ఓపెనర్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. 5-0 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అదేరోజు బాక్సర్ శివ థాపా తన ప్రతాపాన్ని చూపించాడు. పాకిస్తాన్‌కే చెందిన తన ప్రత్యర్థి సులేమాన్ బలోచ్‌కు చుక్కలు చూపించాడు.

రెండో రోజూ దూకుడు..

రెండో రోజూ దూకుడు..

అదే దూకుడును రెండో రోజు కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు భారత క్రీడాకారులు. ప్రస్తుతం అందరి దృష్టీ సాయిఖోమ్ మీరాబాయి చాను మీదే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో వెండి, 2018 నాటి కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని ముద్దాడిన మీరాబాయి చాను ఇవ్వాళ కూడా తన తడాఖా చూపించే అవకాశాలు లేకపోలేదు. తొలి రౌండ్‌లోనే ఆమె పతకాన్ని ఖాయం చేసుకోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

తొలిరోజే విజయాలతో..

తొలిరోజే విజయాలతో..

బ్యాడ్మింటన్‌లో ఎలాగూ భారత్ తిరుగులేదు. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తమ సత్తా ఏమిటో తొలి రోజే చాటి చెప్పారు. ఈ కేటగిరీతో పాటు టేబుల్ టెన్నిస్‌లోనూ నాకౌట్స్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సమాయాత్తమౌతోంది. క్రికెట్‌లో మహిళా జట్టు ఓటమితో కామన్వెల్త్ గేమ్స్‌ను మొదలు పెట్టినప్పటికీ.. విజయాలను చవి చూసే అవకాశాలు మాత్రం లేకపోలేదు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

క్రికెట్‌లో చేదు అనుభవం..

క్రికెట్‌లో చేదు అనుభవం..

తన తరువాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూల్ అయింది. టేబుల్ టెన్నిస్‌లో దక్షిణాఫ్రికా, ఫిజీలను ఓడించింది. బాక్సింగ్‌లో శివ థాపా.. తనకు ఎదురులేదనిపించుకున్నాడు. 63.5 కేజీల కేటగిరీలో 32 బౌట్లల్లో పాకిస్తాన్‌కు చెందిన సులేమాన్ బలోచ్‌పై గెలుపొందాడు. ఇవ్వాళ పురుషుల మారథాన్‌లో నితేంద్రసింగ్ రావత్‌‌పై అంచనాలు ఉన్నాయి.

ఇవ్వాళ్టి షెడ్యూల్‌లో

ఇవ్వాళ్టి షెడ్యూల్‌లో

స్విమ్మింగ్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ సెమీఫైనల్‌లో శ్రీహరి నటరాజ్, 200 మీటర్ల ఫ్రీస్టైల్‌ హీట్-3లో కుషాగ్ర రావత్ ఇవ్వాళ పాల్గొననున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గర్, 61 కేజీల కేటగిరీలో గురురాజా, మహిళల 49 కేజీల విభాగంలో సాయిఖొమ్ మీరాబాయి చాను పార్టిసిపేట్ చేయనున్నారు. టేబుల్ టెన్నిస్‌లో మహిళల విభాగంలో భారత్-గయానా, పురుషుల కేటగిరీలో భారత్ వర్సెస్ నార్తరన్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో జరుగనున్నాయి.

జిమ్నాస్టిక్స్‌లో..

జిమ్నాస్టిక్స్‌లో..

జిమ్నాస్టిక్స్‌లో మహిళల విభాగంలో ప్రణతి నాయక్, రుతురాజ్ నటరాజ్, ప్రతిష్ఠ సమంత పాల్గొననున్నారు. బ్యాడ్మింటన్‌లో మిక్స్డ్ టీమ్ గ్రూప్-ఏలో భారత్‌తో శ్రీలంకతో పోటీ పడనుంది. మరో గ్రూప్‌లో భారత్-ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి. బాక్సింగ్‌లో హస్సముద్దీన్ మహ్మద్.. దక్షిణాఫ్రికాకు చెందిన అమ్జోలెలెతో తలపడనున్నారు. మహిళల హాకీ పూల్-ఏలో భారత్-వేల్స్ ఢీ కొట్టబోతోన్నాయి.

Story first published: Saturday, July 30, 2022, 13:04 [IST]
Other articles published on Jul 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X