కామన్వెల్త్: భారత ఖాతాలోకి 13వది.. స్వర్ణం గెలిచిన రెజ్లర్ రాహుల్

Posted By:
Commonwealth Games 2018: Wrestler Rahul Aware advances by overpowering George Ramm of England

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో గురువారం మరో స్వర్ణం దక్కింది. ఇప్పటికే 12స్వర్ణాలతో మూడు స్థానంలో ఉన్న భారత్‌కు ఇది 13వది. ప్రముఖ రెజ్లర్ 57కేజీల విభాగంలో ఇంగ్లాండ్‌ రెజ్లర్ జార్జ్ రామ్మ్‌ను ఓడించి స్వర్ణాన్ని సాధించాడు. ప్రత్యర్థిని 11-0 పాయింట్లతో చిత్తు చేసి అవారే బౌట్ ను ఏకపక్షం చేసేశాడు. అతని చీలమండల భాగంలో పట్టుకోవడంతో ప్రత్యర్థి ఎటూ కదలలేకపోయాడు. ఇదే శైలిలో పలుమార్లు యత్నించి ప్రత్యర్థిని చిత్తు చేశాడు రాహుల్.

ఇప్పటి వరకు భారత్ 26 పతకాలు సాధించగా అందులో 12 స్వర్ణాలు, 6 రజితాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. ఇది భారత్ కు మూడో స్థానం. అయితే టాప్ లో ఆస్ట్రేలియా మొత్తం 146పతకాలను గెలుచుకుంది. అంతకుముందు ఎనిమిదో రోజు పతకాల వేటను షూటర్‌ తేజస్వినీ సావంత్‌ రజతంతో ఆరంభించారు.

50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్లో ఆమె రెండోస్థానంలో నిలిచి వెండి పతకాన్ని తెచ్చారు. మహిళల రెజ్లింగ్‌ 53 కేజీల విభాగంలో రెజ్లర్‌ బబితా కుమారి రజతం సాధించారు. మహిళల 76 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ కిరణ్‌ కాంస్య పతకాన్ని అందుకున్నారు. దీంతో భారత్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఇప్పటివరకూ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 28కు చేరింది.

Story first published: Thursday, April 12, 2018, 14:07 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి