న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్‌వెల్త్ క్రీడల్లో 2 లక్షలపైనే కండోమ్‌లు.. అంత తక్కువా..!

Commonwealth Games 2018: More than 2 lakhs condoms on offer for athletes in Gold Coast

హైదరాబాద్: అన్నింటిలానే కామన్‌వెల్త్ గేమ్స్‌‌లో సైతం కండోమ్‌ల కేటాయింపు జరిపారు. ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ క్రీడల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్-2018 జరగనున్నాయి. వేలాది మంది క్రీడాకారులు, అధికారులు, లక్షలాది మంది అభిమానులు సమక్షంలో గోల్డ్ కోస్ట్ అత్యంత సుందరంగా ముస్తాబైంది.

34 కండోమ్స్ మాత్రమే

34 కండోమ్స్ మాత్రమే

ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ కోసం వారికి లక్షల సంఖ్యలో కండోమ్స్ అందుబాటులో ఉంచారు. కామన్వెల్త్ గేమ్స్ జరగనున్న 11 రోజులపాటు దాదాపు 2.25 లక్షల కండోమ్‌లు, 17000 టాయిలెట్ రోల్స్‌ అందుబాటులో ఉంచారు. ఒకొక్కరికీ 34 కండోమ్స్ మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఈ పోటీల్లో సుమారు 6,600 మంది అథ్లెట్లు పాల్గొంటున్నట్టు సమాచారం.

అత్యధికంగా 4.50 లక్షల కండోమ్స్

అత్యధికంగా 4.50 లక్షల కండోమ్స్

అంటే ఒక్కో అథ్లెట్ రోజుకి 3 కండోమ్స్ వినియోగించుకొవచ్చన్నమాట. అంతేకాకుండా అందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో అథ్లెట్లకి అత్యధికంగా 4.50 లక్షల కండోమ్స్ పంపిణీ చేశారు. ఆ సమయంలో జికా వ్యాధి ప్రబలంగా ఉండటంతో.. ఎవరికీ ఎలాంటి హాని జరుగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత అథ్లెట్ల జెండా వందనం:

భారత అథ్లెట్ల జెండా వందనం:

కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత అథ్లెట్లు సోమవారం క్రీడాగ్రామంలో జెండా వందనం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అథ్లెట్లందరూ త్రివర్ణ పతకానికి గౌరవ వందనం చేశారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన భారత స్టార్‌ మహిళా బాక్సర్‌ మేరీకోమ్, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సహా అందరూ ఆహ్లాదంగా గడిపారు. జాతి గర్వించే నినాదాలు చేశారు. క్రీడా గ్రామంలో భారత బృందం బస చేసిన భవనం సమీపంలో సిరంజీలు బయట పడిన ఘటనపై స్పందించేందుకు భారత చెఫ్‌ డి మిషన్‌ విక్రమ్‌ సిసోడియా నిరాకరించారు.

శాఖహార మాంసాహార వంటకాలు:

శాఖహార మాంసాహార వంటకాలు:

కామన్‌వెల్త్ విలేజ్‌లో ఆటగాళ్ల ఆహ్లాదం కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. స్విమ్మింగ్ పూల్స్, మానవ నిర్మిత జలపాలాలతో కూడిన ప్రత్యేక లాంజ్‌లు, 24 గంటలు పనిచేసే డైనింగ్ రూమ్‌లు అందుబాటులోకి తెచ్చారు. అథ్లెట్ల కోసం శాఖహారం, మాంసాహార వంటకాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అథ్లెట్లు బసచేయడానికి 1,250 అపార్ట్‌మెంట్లు, టౌన్ హౌస్‌లు నిర్మించారు. ఆటలు ముగిసిన తర్వాత కామన్‌వెల్త్ విలేజ్‌ని అమ్మకానికి లేదా అద్దెకు ఇవ్వనున్నారు.

Story first published: Tuesday, April 3, 2018, 10:23 [IST]
Other articles published on Apr 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X