స్వర్ణం గెలిచిన భారత వెయిట్‌లిఫ్టర్‌పై ఇటుకలతో దాడి

Posted By:
Commonwealth Games 2018 gold medal winner Punam Yadav attacked in Rohaniya

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్‌పై ఇటుకలతో దాడి జరిగింది. విజయం సాధించి స్వదేశానికి వచ్చిన వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్‌.. ప్రస్తుతం వారణాసి జిల్లా రోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగ్వార్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు పూనమ్. అక్కడ దాడి జరగడంతో పూనమ్.. రోహానియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంధువులకు, పొరుగింటివారికి మధ్య గొడవ

తన బంధువులకు, పొరుగింటివారికి మధ్య గొడవ జరిగిందని.. ఈ ఘర్షణలో కలుగజేసుకున్న తనపై వారు దాడి చేశారని ఫిర్యాదులో పూనమ్ పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించి పుట్టిన ఊరికి, దేశానికి గర్వకారణంగా నిలిచిన పూనమ్‌కు వారణాసిలో కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

మేనమామ కైలాశ్ యాదవ్‌ను కలుసుకునేందుకు:

మేనమామ కైలాశ్ యాదవ్‌ను కలుసుకునేందుకు:

శుక్రవారం వారణాసి చేరుకున్న పూనమ్.. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలం దాదుపూర్‌లోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు. అయితే ముంగ్వార్ గ్రామంలో ఉన్న మేనమామ కైలాశ్ యాదవ్‌ను కలుసుకునేందుకు.. గ్రామానికి చేరుకున్న సమయంలో కైలాష్ కుటుంబం, ఎదురింటి వారు గొడవపడుతున్నారు. గొడవను సద్దుమనిగించేందుకు పూనమ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

 ఇటుకలు, రాళ్లతో పూనమ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులపై:

ఇటుకలు, రాళ్లతో పూనమ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులపై:

ప్రత్యర్థులైన లుల్లార్ యాదవ్, పుల్లార్ యాదవ్ అక్కడితో ఆగకుండా ఇటుకలు, రాళ్లతో పూనమ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. మాటా మాటా పెరిగడంతో దాడులకు దిగారు. ఈ దాడిలో పూనమ్ మామతో సహా సోదరి శశి యాదవ్‌కు గాయాలయ్యానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.

 222 కేజీల బరువులు ఎత్తి పూనమ్ గోల్డ్ మెడల్ సొంతం:

222 కేజీల బరువులు ఎత్తి పూనమ్ గోల్డ్ మెడల్ సొంతం:

వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పూనమ్ బంగారు పతకం సాధించారు. స్నాచ్‌లో 100 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 122 కేజీలు కలుపుకుని మొత్తం 222 కేజీల బరువులు ఎత్తి పూనమ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. అప్పటికి ఇది భారత్‌కు ఐదో గోల్డ్ మెడల్. ఓవరల్‌గా 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఏడో పతకం. ప్రస్తుతం 59 పతకాలతో భారత్ పట్టికలో మూడో స్థానంలో ఉంది. వీటిలో 25 స్వర్ణాలు ఉండగా.. 16 రజత పతకాలు, 18 కాంస్య పతకాలు ఉన్నాయి.

Story first published: Sunday, April 15, 2018, 12:54 [IST]
Other articles published on Apr 15, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి