కామన్వెల్త్ క్రీడా గ్రామంలో కూడా బాల్ టాంపరింగ్‌పైనే చర్చ

Posted By:
Commonwealth Games 2018: Australian cricketers ball-tampering scandal is big talking point at Athletes Village

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా ఇమేజిని పూర్తిగా డామేజ్ చేసింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ముగ్గరిపై కఠిన చర్యలు తీసుకుంది.

స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించగా, బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నించిన బాన్‌క్రాప్ట్‌కు 9 నెలల పాటు నిషేధం విధించింది. అయినా సరే ఈ బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియాను వీడటం లేదు. తాజాగా ఏప్రిల్ 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయి.

కామన్వెల్త్ క్రీడాగ్రామంలో బాల్ టాంపరింగ్‌పై చర్చ

కామన్వెల్త్ క్రీడాగ్రామంలో బాల్ టాంపరింగ్‌పై చర్చ

కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు లేకపోయినప్పటికీ, ప్రస్తుతం గోల్డ్‌కోస్ట్‌లో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ ఉదంతంపై క్రీడాకారులు చర్చించుకుంటున్నారట. క్రీడాగ్రామంలో ఏ ఇద్దరు ఆటగాళ్లు కలిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీనిపై చర్చ మాత్రం ఆగడం లేదంట.

గోల్డ్‌కోస్ట్‌లో విమానాశ్రయంలో ఓ జర్నలిస్ట్‌తో

గోల్డ్‌కోస్ట్‌లో విమానాశ్రయంలో ఓ జర్నలిస్ట్‌తో

కామన్వెల్త్ గేమ్స్‌లో దయచేసి టాంపరింగ్ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దని గోల్డ్‌కోస్ట్‌లో విమానాశ్రయంలో ఓ జర్నలిస్ట్‌కు ఇమ్మిగ్రేషన్ అధికారి విజ్ఞప్తి చేశాడంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ నిబంధనలను ఉల్లంఘించడం సరైంది కాదని క్రీడాగ్రామంలో పని చేస్తున్న ఓ వాలంటీర్ అన్నాడు.

బాల్ టాంపరింగ్ మచ్చను చెడిపేసుకుని సరైన దిశలో

బాల్ టాంపరింగ్ మచ్చను చెడిపేసుకుని సరైన దిశలో

ప్రస్తుతం జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లోనైనా ఆ మచ్చను చెడిపేసుకుని సరైన దిశలో ముందుకు సాగుతామని ఆతడు స్పష్టం చేశాడు. బాల్ టాంపరింగ్ వివాదం కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే ఆసీస్ అథ్లెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే ఆస్టేలియా అథ్లెట్లకు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు.

సిరంజీ వివాదానికి హెచ్చరికతో ముగింపు

సిరంజీ వివాదానికి హెచ్చరికతో ముగింపు

మరోవైపు గత మూడు రోజులుగా భారత బాక్సర్లకు నిద్రలేకుండా చేసిన సిరంజీ (సూది) కలకలానికి కామన్వెల్త్ నిర్వాహకులు హెచ్చరికతో ముగింపు పలికారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన సీజీఎఫ్ సమాఖ్య.. క్రీడా గ్రామంలో భారత బాక్సింగ్ జట్టు ఉంటున్న ప్రదేశంలో మరోసారి సూది కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించింది.

సిరంజీలను క్రీడాగ్రామంలోకి అనుమతించరు

సిరంజీలను క్రీడాగ్రామంలోకి అనుమతించరు

కామన్వెల్త్ గేమ్స్ నిబంధనల ప్రకారం సిరంజీలను క్రీడాగ్రామంలోకి అనుమతించరు. వాటని సెంట్రల్ స్టోర్‌లో అప్పగించి అవసరమైనప్పుడు సదరు డాక్టర్ హామీతో వాటిని వినియోగిస్తారు. కానీ అనారోగ్యంతో ఉన్న బాక్సర్‌కు విటమిన్ బి ఇంజెక్షన్‌ను ఇవ్వడానికి భారత బాక్సింగ్ టీమ్ డాక్టర్ అమోల్ పాటిల్ దీనిని తీసుకొచ్చారు.

భారత బాక్సర్లకు సులువైన డ్రా

భారత బాక్సర్లకు సులువైన డ్రా

ఆ తర్వాత స్టోర్స్‌లో అప్పగించలేదు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై కాస్త సీరియస్‌గా ఉన్న సీజీఎఫ్ గేమ్స్ విధి విధానాలను తెలుసుకుని వ్యవహరించాలని భారత చెఫ్ డి మిషన్, పాటిల్‌లకు ఘాటుగా లేఖలు రాసింది. మరోవైపు ఈ గేమ్స్‌లో భారత బాక్సర్లకు సులువైన డ్రా పడింది. మేరీకోమ్ ఒక్క బౌట్‌లో గెలిస్తే పతకాన్ని అందుకోవచ్చు.

Story first published: Wednesday, April 4, 2018, 11:42 [IST]
Other articles published on Apr 4, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి