న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అయ్యో.. 'మో ఫరా' ఎంతపనాయే! 4 సార్లు చాంపియన్‌ సెకండ్ల వ్యవధిలో మిస్!!

British Athlet Mo Farah fails to qualify for Tokyo Olympics Games

మాంచెస్టర్‌: ఒలంపిక్స్‌లో ఆడాలని ప్రతి ఒక్క అథ్లెట్‌ కల. అందుకోసం అథ్లెట్‌లు అందరూ ఏళ్ల తరబడి సాధన చేస్తుంటారు. అంతటి ప్రతిష్టాత్మక టోర్నికి కేవలం 19 సెకన్ల ఆలస్యం వల్ల అర్హత కోల్పోతే.. ఆ బాధను వర్ణించలేం. అది కూడా మొదటి సారి ఒలంపిక్స్‌లో అడుగుపెడుతున్న అథ్లెట్‌ కాదు.. ఏకంగా 4 సార్లు చాంపియన్‌గా నిలిచిన వ్యక్తి ఇలా తృటిలో అవకాశం చేజార్చుకున్నాడంటే నమ్మగలమా?. కానీ నమ్మాలి. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రిటన్‌ స్టార్‌ అథ్లెట్‌ మో ఫారా.

Sajan Prakash: ప్రకాశ్‌కు టోక్యో బెర్త్‌.. భారత తొలి స్విమ్మర్‌గా చరిత్ర!!Sajan Prakash: ప్రకాశ్‌కు టోక్యో బెర్త్‌.. భారత తొలి స్విమ్మర్‌గా చరిత్ర!!

శుక్రవారం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన బ్రిటిష్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మో ఫరా 10వేల మీటర్ల రేసులో ఒలింపిక్‌ అర్హత టైమింగ్‌ను అందుకోలేకపోయాడు. విశ్వక్రీడలకు క్వాలిఫయింగ్‌ టైమ్‌ 27 నిమిషాల 28 సెకన్లు కాగా.. మో ఫరా మాత్రం 27 నిమిషాల 47.04 సెకన్లలో రేసును ముగించాడు. దీంతో అతను ఈసారి మెగా ఈవెంట్‌కు దూరం కాక తప్పడం లేదు. అర్హత ప్రక్రియకు ఆదివారమే తుది గడువు కాబట్టి అతనికి ఈ క్రీడల్లో పోటీపడే అవకాశం లేనట్లే.

10వేల మీటర్లలో తిరుగులేని హీరోగా నీరాజనాలందుకున్న మో ఫరా ఈ రేసులో విఫలమవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోసారి ఒలంపిక్స్‌లో ఐదోసారి చాంపియన్‌గా నిలవాలన్న మో పారా నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది. తాజా ప్రదర్శనతో 38 ఏళ్ల ఫరా కెరీర్‌ దాదాపు ముగిసినట్లే. త్వరలోనే అతడు రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతడి అభిమానులు మాత్రం మరికొంతకాలం కొనసాగాలని కోరుకుంటున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్​ జరగనున్నాయి.

Story first published: Sunday, June 27, 2021, 11:52 [IST]
Other articles published on Jun 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X