కామన్వెల్త్ గేమ్స్‌లో మ్యాచ్ దక్కింది.. ప్రపోజల్‌తో ప్రేమ గెలిచింది

Written By:
England players Jamell

హైదరాబాద్: మ్యాచ్ గెలిచాడు.. స్టేడియంలో ఉండే ప్రేమను ప్రపోజ్ చేసి ప్రేయసిని గెలిచాడు. అందరికీ రాదు అవకాశం, మ్యాచ్‌ను గెలవడం కంటే కోరుకున్న ప్రేమను గెలుచుకోవడమే ఆనందం. అలాంటిది రెండూ ఒకేసారి వస్తే.. ఆ జాక్ పాట్ కొట్టేశాడు ఇంగ్లాండ్ బాస్కెట్‌బాల్ ప్లేయర్.

అస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇలాంటి మధుర క్షణం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ .. మరోవైపు ఆ దేశానికి చెందిన ఇద్దరు బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్స్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ను తమ జీవితాల్లో మరచిపోలేని వేడుకకు వేదికగా చేసుకున్నారు. తోటి ఆటగాళ్ల సమక్షంలో జరిగిన ఈ ప్రపోజల్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బాస్కెట్‌‌బాల్‌ పురుషుల జట్టుకు చెందిన జామెల్‌ అండర్సన్‌, ఆ దేశ బాస్కెట్‌‌బాల్‌ మహిళల జట్టుకు చెందిన జార్జియా జోన్స్‌కి ప్రపోజ్‌ చేశాడు. బాస్కెట్‌ బాల్‌ విభాగంలో కామెరూన్‌ జట్టుపై విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్‌ జట్టు సభ్యుడు అండర్సన్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ జోన్స్‌కి మోకాలిపై కూర్చోని సినిమా సీన్లను తలపించేలా.. తన ప్రేమ విషయాన్ని తెలిపాడు.

దీంతో సమ్మతించిన జార్జియా జోన్స్‌ ముద్దిచ్చి అంగీకారాన్ని తెలిపింది. అండర్సన్‌ తోటి క్రీడాకారుల సమక్షంలో ఆమెకు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగాడు. దీంతో ఆ ప్రేమ జంటకు అక్కడ ఉన్నవారంతా ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలిపారు. తన తోటి క్రీడాకారులు చేసిన ఏర్పాట్ల వల్లే ఇంత చక్కగా తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్‌ చేయగలిగానని అండర్సన్‌ తెలిపాడు. వీరి నిశ్చితార్థంతో మైదానంలో సందడి వాతావరణం నెలకొంది.

Story first published: Sunday, April 8, 2018, 21:28 [IST]
Other articles published on Apr 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి