న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రజతంతో సరికొత్త చరిత్ర: తొలి భారత రెజ్లర్‌గా భజరంగ్‌ రికార్డు

Bajrang Punia Settles for Silver, Otoguro Becomes Youngest World Champion From Japan

బుడాపెస్ట్: కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలతో మెరిసిన యువ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా అదే ప్రదర్శనను హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పునరావృతం చేయలేకపోయాడు. సోమవారం పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భజరంగ్‌కు.. జపాన్‌ యువ రెజ్లర్‌ టకుటో ఒటోగురో షాకిచ్చాడు.

విశాఖలో టీమిండియా: మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ, విశేషాలివేవిశాఖలో టీమిండియా: మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ, విశేషాలివే

పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగం ఫైనల్లో 24 ఏళ్ల బజరంగ్‌ 9-16 పాయింట్ల తేడాతో టకుటో ఒటోగురో చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భజరంగ్‌ స్వర్ణం కోల్పోయినప్పటికీ.. అతడు చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు.

 2013లో కాంస్యం నెగ్గిన భజరంగ్

2013లో కాంస్యం నెగ్గిన భజరంగ్

2013లో బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. భజరంగ్ 2013లో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. 19 ఏళ్ల టకుటోకు అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉండటంతో స్వర్ణం భజరంగ్‌‌దే అని అంతా అనుకున్నారు. అయితే, బౌట్‌ మొదలైన తొలి నిమిషంలోనే టకుటో ఒటోగురో ఐదు పాయింట్లు సొంతం చేసుకుని భజరంగ్‌కు షాకిచ్చాడు.

భజరంగ్‌కు తీవ్ర ప్రతిఘటన తప్పలేదు

భజరంగ్‌కు తీవ్ర ప్రతిఘటన తప్పలేదు

ఆ తర్వాత తేరుకున్న భజరంగ్ వెంటవెంటనే రెండేసి పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 5-4కి తగ్గించాడు. ఆ తర్వాత ఒటోగురో ఏదశలోనూ దూకుడును తగ్గించకపోవడంతో బజరంగ్‌కు తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. తొలి రౌండ్‌ ముగిసేసరికి 6-7తో ప్రత్యర్థికి చేరువగా రావడంతో బజరంగ్‌కు అవకాశాలున్నట్లే అనిపించింది. రెండో భాగంలో స్కోరును సమం చేసే ప్రయత్నంలో బజరంగ్‌ తీవ్రంగా ప్రయత్నించాడు.

భజరంగ్ చిన్నపాటి తప్పిదాలు

భజరంగ్ చిన్నపాటి తప్పిదాలు

ఈ క్రమంలో భజరంగ్ చిన్నపాటి తప్పిదాలకు పాల్పడ్డాడు. అదే సమయంలో ఒటోగురో ఐదు పాయింట్లు సంపాదించి 12-6తో ముందంజ వేశాడు. చివర్లో భజరంగ్‌ కోలుకునే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ పోరులో భజరంగ్ స్వర్ణం గెలిస్తే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏకైక పసిడి నెగ్గిన సుశీల్‌ కుమార్‌ సరసన నిలిచేవాడు. 2010 మాస్కో టోర్నీలో సుశీల్‌ 66 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు.

 ఈ ఏడాది ఆరు పతకాలు సాధించిన భజరంగ్

ఈ ఏడాది ఆరు పతకాలు సాధించిన భజరంగ్

ఈ ఏడాదిలో భజరంగ్‌ పాల్గొన్న ఆరు అంతర్జాతీయ టోర్నీల్లోనూ పతకాలు సాధించాడు. కామన్వెల్త్‌ గేమ్స్, టిబిలిసి గ్రాండ్‌ప్రి టోర్నీ, యాసర్‌ డోగు టోర్నీ, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచాడు. ప్రస్తుత టోర్నీ పురుషుల 70 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో ప్రవీణ్‌ రాణా, 97 కేజీల క్వాలిఫయింగ్‌ రౌండ్లో మౌసమ్‌ ఖత్రి.. మహిళల 59 కేజీల క్వార్టర్స్‌లో సరిత, 55 కేజీ ప్రిక్వార్టర్స్‌లో సీమ ఓడిపోయారు.

Story first published: Tuesday, October 23, 2018, 13:12 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X