న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Wrestling Championships: కాంస్యంతో మెరిసిన పూనియా, రవి

 Bajrang Punia, Ravi Dahiya win bronze medal in World Wrestling Championships

హైదరాబాద్: కజికిస్థాన్‌‌లోని నూర్ సుల్తాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు భజరంగ్ పూనియా, రవి దహియ పతకాలతో మెరిశారు. భజరంగ్‌ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు) విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు.

మంగోలియా రెజ్లర్ తుల్గా తుముర్ ఓచిర్‌తో ఉత్కంఠభరితంగా సాగిన బౌట్‌లో భజరంగ్ పునియా 8-7తో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. పునియాకు ఇది మూడో పతకం. 2013లో కాంస్యం సాధించిన భజరంగ్ గతేడాది ఫైనల్లో ఓడి రజతం కైవసం చేసుకున్నాడు.

'అతడి వల్ల కాదు... సారథ్య బాధ్యతల నుంచి తప్పించండి''అతడి వల్ల కాదు... సారథ్య బాధ్యతల నుంచి తప్పించండి'

57 కేజీల విభాగంలో

57 కేజీల విభాగంలో

ఇక, 57 కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్ రవి దహియ 6-3తో ఆసియా చాంపియన్ రెజా అత్రి నాగర్చి (ఇరాన్)పై నెగ్గి కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. వెటరన్‌ స్టార్‌ రెజ్లర్ సుశీల్‌ కుమార్‌కు (74 కేజీలు) తొలి రౌండ్లోనే 9-11తో ఖాజిమురాద్ (అజర్‌బైజాన్) చేతిలో ఓడాడు.

వరుసగా 7 పాయింట్లు

వరుసగా 7 పాయింట్లు

ఒక దశలో 9-4తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వరుసగా 7 పాయింట్లు కోల్పోయాడు. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సుశీల్‌ 2010లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. సుశీల్‌పై గెలిచిన ఖద్జిమురద్‌ క్వార్టర్స్‌లో ఓడిపోవడంతో భారత రెజ్లర్‌కు ‘రెపిచేజ్‌' అవకాశం లేకుండా పోయింది.

నా జీవితంలో మరువలేను

నా జీవితంలో మరువలేను

పోరు అనంతరం భజరంగ్ పూనియా మాట్లాడుతూ "టోర్నీ నిర్వాహకుల తీరును జీవితంలో మరువలేను. అసలు కాంస్య పతక పోరులో బరిలో దిగకూడదని అనుకున్నా. కానీ పతకం ఏదైనా పతకమే అవుతుందని నా కోచ్‌లు సర్దిచెప్పడంతో బౌట్‌లో అడుగుపెట్టా" అని తెలిపాడు.

ఆరంభంలో వెనుకపడటం నా స్టైల్

"ఆరంభంలో వెనుకపడటం నా స్టైల్. గత నాలుగేళ్లుగా ఇదే కొనసాగిస్తున్నా. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాలని చాలా కష్టపడ్డా. రిఫరీలు నా పట్ల ప్రవర్తించిన తీరుని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నా" అని భజరంగ్ పూనియా అన్నాడు.

Story first published: Saturday, September 21, 2019, 9:11 [IST]
Other articles published on Sep 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X