న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరుదైన ఘనత: 12 ఏళ్లకే ప్రపంచ రికార్డు నెలకొల్పిన చెన్నై బుడతడు

By Nageshwara Rao
At 12 yrs 10 mths, Chennai boy is world’s 2nd-youngest Grandmaster

హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పిన్నవయసు కలిగిన రెండో గ్రాండ్‌ మాస్టర్‌గా చెన్నైకి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఇటలీ వేదికగా జరుగుతున్న గ్రెన్‌డైన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ప్రజ్ఞానంద ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ప్రజ్ఞానంద వయసు 12 ఏళ్ల 10 నెలలు.

అంతేకాకుండా దేశంలోనే అతిచిన్న గ్రాండ్‌ మాస్టర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా అతి తక్కువ వయస్సులో(12 ఏండ్ల 7నెలలు) గ్రాండ్‌ మాస్టర్ అందుకున్న రికార్డు ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ కార్జకిన్ పేరిట ఉంది. 2002లో కర్జాకిన్‌కు 12 ఏళ్ల 7నెలల వయసున్నప్పుడు 2002లో ఈఘనత సాధించాడు.

16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పన్నెండేళ్లకే ఈ ఘనత సాధించిన రికార్డును ప్రజ్ఞానంద సొంతం చేసుకున్నాడు. 2017లో ఇటలీలో జరిగిన ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌లోనూ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. దీంతో పాటు 2016లో అంతర్జాతీయ మాస్టర్ హోదాను ప్రజ్ఞానంద పదేళ్ల వయస్సులోనే అందుకుని అరుదైన రికార్డు నెలకొల్పాడు.

తాజాగా ప్రజ్ఞానంద సాధించిన అరుదైన ఘనతపై భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించాడు. "గ్రాండ్‌మాస్టర్ క్లబ్‌లోకి స్వాగతం. అభినందనలు ప్రజ్ఞానంద. త్వరలోనే నిన్ను చెన్నైలో కలుస్తా" అని ట్వీట్‌ చేశాడు.

Story first published: Monday, June 25, 2018, 12:56 [IST]
Other articles published on Jun 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X