న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భిన్‌ భిన్, అటుంగ్, కాకా: ఇవి ఆసియా గేమ్స్ మస్కట్స్ పేర్లు

By Nageshwara Rao
Asian Games mascots: how does 2018 trio of Bhin Bhin, Atung and Kaka compare to creations of decades past?

జకార్తా: ఆసియా అతిపెద్ద క్రీడా సమరానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా శనివారం సాయంత్రం 5:30 గంటలకు అధికారికంగా ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఆరంభ వేడుకలకు జకార్తాలోని జిలోరా బుంగ్ కర్ణో స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు

ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు

ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు పోటీలు జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో 45 దేశాల నుంచి 11 వేలకు మందిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలోకి దిగనున్నారు. భారత్‌ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యారు. వీరిలో 311 మంది పురుషులు, 260 మంది మహిళలు ఉన్నారు.

 ఆదివారం నుంచి పోటీలు

ఆదివారం నుంచి పోటీలు

తొలిరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. పోటీలు ఆదివారం మొదలవుతాయి. కాగా, ఈసారి ‘ఎనర్జీ ఆఫ్‌ ఆసియా'ని ఆసియా గేమ్స్ మోటోగా నిర్ధారించారు. దీంతో పాటు మస్కట్‌లుగా భిన్‌ భిన్, అటుంగ్, కాకాలను ప్రకటించారు. భిన్‌ భిన్‌ను బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌గా అభివర్ణిస్తారు.

భిన్‌ భిన్‌ వ్యూహానికి, ఎత్తుగడలకు ప్రతీక

భిన్‌ భిన్‌ వ్యూహానికి, ఎత్తుగడలకు ప్రతీక

ఈశాన్య ఇండోనేసియాలో కనిపించే ఈ పక్షి వ్యూహానికి, ఎత్తుగడలకు ప్రతీక. ఇక, అటుంగ్ విషయానికి వస్తే వేగంగా పరుగెత్తే బవియన్‌ దుప్పి. ఇండోనేసియా మధ్య ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయివి. ‘ఎప్పటికీ వదలొద్దు (నెవర్‌ గివ్‌ అప్‌)' అనే ఉద్దేశంలో దీనిని ఎంపిక చేశారు.

 శక్తికి చిహ్నంగానూ పేర్కొంటూ

శక్తికి చిహ్నంగానూ పేర్కొంటూ

మూడోది కాకా... ఇది ఖడ్గమృగం. అసలు పేరు ఇకా. అంతరిస్తోన్న ఈ జంతువు విశిష్టత తెలిపేందుకు, శక్తికి చిహ్నంగానూ పేర్కొంటూ మస్కట్‌గా ప్రకటించారు. ఈ మూడు మస్కట్లు ఆసియా గేమ్స్ వీక్షించడానికి వచ్చిన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Story first published: Saturday, August 18, 2018, 12:05 [IST]
Other articles published on Aug 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X