న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారణం ఇదీ: అవార్డు తీసుకునేందుకు నిరాకరించిన స్వర్ణపతక విజేత

Asian Games gold medallist Sudha Singh refuses, then accepts award

హైదరాబాద్: ప్రముఖ అథ్లెట్ సుధాసింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా రూ.30లక్షల చెక్‌ తీసుకునేందుకు నిరాకరించింది. జకార్తా వేదికగా ముగిసిన ఆసియా గేమ్స్‌లో అథ్లెట్ సుధాసింగ్‌ స్వర్ణం సాధించడంతో పాటు స్టీపుల్‌ఛేజ్‌లో తొమ్మిది సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.

ఆసియా గేమ్స్ పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలతో సత్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం లక్నోలో క్రీడాకారులకు చెక్కుల పంపిణీ చేస్తున్న సమయంలో సుధా సింగ్ తొలుత చెక్‌ తీసుకునేందుకు నిరాకరించారు. తనకు రూ.30 లక్షలు వద్దని, ప్రభుత్వ ఉద్యోగం కావాలని సీఎం యోగని కోరారు.

 ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ

ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ

చివరకు ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆ తర్వాత ఆమె చెక్‌‌ను ఆయన చేతుల మీదుగా అందుకున్నారు. ఇక, సుధా విషయానికి వస్తే, 2010లో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించగా, ఇటీవల జకార్తా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో రజత పతకం గెలుచుకుంది.

యూపీ స్పోర్ట్స్‌ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ పదవి

యూపీ స్పోర్ట్స్‌ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ పదవి

రెండు సార్లు భారతదేశం పేరుని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేసిన తనకు ప్రభుత్వం యూపీ స్పోర్ట్స్‌ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌ పదవి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెక్‌ తీసుకోవడానికి నిరాకరించి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో గవర్నర్‌ రామ్‌ నాయక్‌ కూడా అక్కడే ఉన్నారు.

హామీ ఇవ్వడంతో తిరిగి వచ్చి చెక్‌ తీసుకున్న సుధా

హామీ ఇవ్వడంతో తిరిగి వచ్చి చెక్‌ తీసుకున్న సుధా

ఈ ఘటనతో ఐదు నిమిషాల పాటు కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి వచ్చి చెక్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా సుధా సింగ్ మాట్లాడుతూ "నాకు డబ్బులు అక్కర్లేదు, ఉద్యోగం కావాలి. నాకు ఇవ్వాల్సిన డబ్బును రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు పంపిణీ చేయండి. నాకు మాత్రం ఉద్యోగం ఇవ్వండి" అని ఆమె కోరారు.

 ప్రస్తుతం సెంట్రల్‌ రైల్వేలో అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌‌గా ఉద్యోగం

ప్రస్తుతం సెంట్రల్‌ రైల్వేలో అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌‌గా ఉద్యోగం

"నాకు ఉద్యోగం ఇవ్వడం స్పోర్ట్స్‌ డైరెక్టరేట్‌లో కొందరికి ఇష్టం లేదు. నాకు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉద్యోగం ఇవ్వకపోతే, నాకు ఇచ్చిన నజరానా సొమ్మును తిరిగి ఇచ్చేస్తాను. రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతాను" అని సుధా సింగ్‌ గట్టిగా మాట్లాడారు. 32ఏళ్ల సుధా సింగ్ ప్రస్తుతం సెంట్రల్‌ రైల్వేలో అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌‌గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. 2014లో యూపీ స్పోర్ట్స్‌ డైరెక్టరేట్‌లో రీజినల్‌ ఆఫీసర్‌గా చేరారు. ఆ తర్వాత భారత్‌కు పతకాలు అందిస్తోండటంతో ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్‌‌ పదవి కోరుతుండటం విశేషం.

Story first published: Wednesday, October 3, 2018, 14:04 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X