న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆచితూచి ఆడతాం: ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు కోచ్

By Nageshwara Rao
Asian Games 2018: Indias mens hockey coach Harendra Singh says team must be cautious in Asiad title defence

హైదరాబాద్: ఇండోనేషియాలోని జకార్తా వేదికగా ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా దిగుతున్న భారత హాకీ జట్టు ఆచి తూచి ఆడాల్సిన అవసరం ఉందని భారత పురుషుల జట్టు కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. జకార్తా వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో హాకీ కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ "ఆసియా క్రీడల్లో భారత్ తలపడే జట్లను తక్కువగా అంచనా వేయం. కొన్ని జట్లు మాకు గట్టి పోటీ ఇస్తాయని బలంగా నమ్ముతున్నా. ఆ దిశగా భారత జట్టు సమిష్టిగా పోరాడుతుంది" అని అన్నాడు. ఆసియా క్రీడల్లో భారత జట్టు పూల్-ఏలో కొరియా, జపాన్, శ్రీలంక, హాంకాంగ్ చైనాతో తలపడుతుంది.

ఆగస్టు 22న హాంకాంగ్ చైనాతో తలపడనున్న భారత్

ఆగస్టు 22న హాంకాంగ్ చైనాతో తలపడనున్న భారత్

ఇక, గ్రూప్-బీలో మలేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఓమన్, థాయ్‌లాండ్‌తోపాటు ఆతిధ్య ఇండోనేషియా జట్లు తలపడతాయి. ప్రస్తుతం ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్‌లో భారత్ 6వ ర్యాంకులో ఉంది. భారత్ తన ప్రారంభ మ్యాచ్ ఆగస్టు 22న హాంకాంగ్ చైనాతో పోటీపడుతుంది. తర్వాత 24న జపాన్, 26న కొరియా, 28న శ్రీలంకతో ఆడుతుంది.

 ఆసియా క్రీడల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తాం

ఆసియా క్రీడల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తాం

భారత్ ఇంతవరకు ఎన్నడూ తలపడని జట్లు హాంకాంగ్ చైనా, శ్రీలంకతో ఆడేటపుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని కోచ్ అన్నాడు. జపాన్ విషయానికొస్తే ఇటీవల ఆడిన కొన్ని ఈవెంట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిందని, అదేవిధంగా కొరియా కూడా బలమైన జట్టుగా ఎదుగుతోందని, ఈ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అన్నాడు.

2014లో పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణం నెగ్గిన భారత్

2014లో పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణం నెగ్గిన భారత్

2014 ఆసియా గేమ్స్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్ స్వర్ణ పతకం అందుకోవడం ద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకున్న విషయాన్ని హరేంద్ర సింగ్ గుర్తు చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సైతం భారత హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించేందుకు తహతహలాడుతోందని చెప్పుకొచ్చాడు.

హాకీ టీమ్ చీఫ్ కోచ్ జియోర్డ్ మరిజ్నే మాట్లాడుతూ

హాకీ టీమ్ చీఫ్ కోచ్ జియోర్డ్ మరిజ్నే మాట్లాడుతూ

భారత మహిళల హాకీ టీమ్ చీఫ్ కోచ్ జియోర్డ్ మరిజ్నే మాట్లాడుతూ "ఆసియా గేమ్స్‌లో మా జట్టు గోల్డ్ మెడల్ సాధించే దిశగా పోరాడుతుంది. కొరియాకు గట్టి పోటీ ఇస్తామనే నమ్మకం ఉంది" అని పేర్కొంది. ఈ ఏడాది కొరియాతో జరిగిన కొన్ని మ్యాచ్‌లలో ప్రత్యర్థి ఆటతీరును ఆసాంతం గమనించామని, అందుకు తగ్గట్టుగా తమ ఆటతీరును ప్రదర్శిస్తామనే విశ్వాసం ఉందని తెలిపింది.

Story first published: Wednesday, July 18, 2018, 16:41 [IST]
Other articles published on Jul 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X