న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యంగెస్ట్ మెడలిస్ట్: అద్భుతం చేసిన 16 ఏళ్ల చైనా కుర్రాడు: అమెరికాకు స్వర్ణం

American shooter Shaner win gold and 16 years old Chinese Sheng Lihao bags silver in mens air rifle

టోక్యో: అంగరంగ వైభవంగా ఆరంభమైన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని అందుకుంది డ్రాగన్ కంట్రీ. టోక్యో ఒలింపిక్స్‌లో అందుకున్న తొలి స్వర్ణం అది. దిగ్విజయంగా బోణీ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా ఏ విభాగానికైనా ఇదే తొలి గోల్డ్ మెడల్. చైనాకు చెందిన స్టార్ విమెన్ షూటర్ యాంగ్ క్వియాన్.. తన తడాఖా చూపించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించింది.

IPL 2021 Phase 2: ఫిట్‌నెస్ కోసం ఆరోన్ ఫించ్ ప్రిపేర్: ఆ రెండు సిరీస్‌ల నుంచి అవుట్IPL 2021 Phase 2: ఫిట్‌నెస్ కోసం ఆరోన్ ఫించ్ ప్రిపేర్: ఆ రెండు సిరీస్‌ల నుంచి అవుట్

అక్కడితో ఆగలేదు చైనా దూకుడు. 10 మీటర్ల పురుషుల విభాగంపైనా చైనా ఆధిపత్యాన్ని చలాయించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం, కాంస్య పతకాలను అందుకుంది. ఈ కేటగిరీలో గోల్డ్ మెడల్‌ను అమెరికా ఎగరేసుకెళ్లింది. అమెరికా షూటర్ విలియమ్ షేనర్ బంగారు పతకాన్ని గెలచుకున్నాడు. చైనా షూటరలు షెంగ్ లిహావో, యాంగ్ హావోరాన్ రజతం, కాంస్య పతకాలను అందుకున్నారు. ఈ ముగ్గురూ టీనేజర్లే. ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని అందుకున్న వారే.


స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విలియం షేనర్ వయస్సు 20 సంవత్సరాలు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 251.6 పాయింట్లను సాధించాడు. ఏ ఒలింపిక్స్‌లో అయినా స్వర్ణాన్ని సాధించిన షూటర్ ఈ రికార్డును నెలకొల్పలేదు. రజత పతకాన్ని అందుకున్న షెంగ్ లిహావో వయస్సు 16 సంవత్సరాలు. ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన యంగెస్ట్ మెడలిస్ట్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటిదాకా చైనా నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.
Tokyo Olympics : Manipur CM Announces Rs 1 Crore Cash Reward For Mirabai Chanu

మూడు స్వర్ణాలు, ఒక రజతంతో నాలుగు పతకాలను అందుకున్న జపాన్ రెండో స్థానంలో కొనసాగుతోండగా.. రెండు చొప్పున బంగారు పతకాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం ఎనిమిది పతకాలతో అమెరికా మూడో ప్లేస్‌ను ఆక్రమించింది. ఊహించినట్టే చైనా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆ దేశానికి చెందిన అథ్లెట్లకు మంచి పట్టు ఉన్న విభాగాల్లో ఖచ్చితంగా మెడల్స్ వస్తాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దానికి అనుగుణంగా చైనా అథ్లెట్ల ప్రదర్శన కొనసాగుతోంది.

Story first published: Sunday, July 25, 2021, 14:59 [IST]
Other articles published on Jul 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X