న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వర్ణ పతకాల అక్షయ పాత్ర.. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రాణించిన అక్షత!

 Akshata shines at National level with another gold medal

చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆ అమ్మాయి ఎన్నో అడ్డంకులను అధిగమించి వెయిట్‌లిఫ్టింగ్‌లో సత్తా చాటుతోంది. ఆమె బెళగావికి చెందిన అక్షత బస్వంత్ కామటి. 22 ఏళ్ల ఈ అమ్మాయి బెళగావిలోని హలగ గ్రామం నుంచి వచ్చింది. తొలిసారి వెయిట్ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఆమె అనుకున్నప్పుడు ఊరిలోని జనం కూడా నవ్వారు. అది అమ్మాయిలకు సూట్ అయ్యే క్రీడ కాదన్నారు. అయితే జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించిన ఆమె వాళ్లందరి నోళ్లూ మూయించింది.

తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో శనివారం జరిగిన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 87 కేజీల విభాగంలో పోటీ పడిన అక్షత.. క్లీన్ అండ్ జర్క్ విభాగంతోపాటు స్నాచ్ విభాగంలో కూడా తమ బృందంతో కలిసి స్వర్ణ పతకం సాధించింది. అంతకుముందు పూణే వేదికగా జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో కూడా అక్షత సత్తా చాటింది. 76 కేజీల విభాగంలో ఏకంగా 176 కేజీలు ఎత్తి రికార్డు నెలకొల్పింది. బిహార్‌లోని బోధ్‌ గయాలో జరిగిన 32వ మహిళల జాతీయ జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో కూడా రాణించిన ఆమె 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం తన ఖాతాలో వేసుకుంది.

హలగలోని శారద గర్ల్స్ హైస్కూల్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు ఆమె వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపినట్లు అక్షత కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కొందరు గ్రామస్థులు ఇది సరైంది కాదని, ఆడ పిల్లలు వెయిట్ లిఫ్టింగ్ చేయడం మంచిది కాదని అన్నారట. ఈ నిరుత్సాహపు మాటలను పట్టించుకోని ఆమె పదో తరగతికి వచ్చినప్పుడు తొలిసారి జాతీయ స్థాయి పోటీలో స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఆమెను ఎగతాళి చేసిన నోళ్లన్నీ మూతపడ్దాయి.

అక్షత తండ్రికి ముగ్గురు అబ్బాయిలు కూడా ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న 10 గుంటల భూమిని వారికి పంచిపెట్టాలని ఆయన అనుకున్నారట. ప్రస్తుతానికి అక్షత శిక్షణ, ఆహారం తదితర అవసరాలన్నీ ప్రభుత్వమే చూస్తున్నప్పటికీ.. ఆమె ప్రత్యేక డైట్, ప్రొటీన్లు వంటి ఇతర ఖర్చులే ఆ కుటుంబానికి నెలకు రూ.25 వేల వరకు అవుతున్నాయట. ఎలాగోలా కష్టపడుతున్న ఆ కుటుంబం ఆమెకు అండగా నిలబడాలనే ఒకే ఒక కోరికతో కష్టపడుతోంది.

Story first published: Monday, January 9, 2023, 12:20 [IST]
Other articles published on Jan 9, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X