న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోడ్లకు మరమ్మత్తులు: దీపా దెబ్బకు దిగొచ్చిన త్రిపుర సర్కార్

By Nageshwara Rao

హైదరాబాద్: దీపా కర్మార్కర్ కోసం త్రిపుర ప్రభుత్వం దిగొచ్చింది. ఆమె నివాసం దగ్గర, సమీపంలోని రోడ్లకు సంబంధించిన మరమ్మత్తులను త్రిపుర ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్వహిస్తోంది. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించిన విజేతలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఇందులో భాగంగా సచిన్ చేతుల మీదగా స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. అయితే ఆమె నివసించే అగర్తల రోడ్లపై ఖరీదైన బీఎండబ్ల్యూ కారును తిప్పడం చాలా కష్టమని, తగిన సర్వీస్‌ సెంటర్లు కూడా లేనందున.. బీఎండబ్ల్యూను కారును ఇచ్చివేసి దానికి తగిన నగదు కోరినట్టు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

After Dipa Karmakar's request to return BMW, Tripura govt to repair road near her house

సచిన్ చేతుల మీదుగా అందుకున్న బీఎండబ్ల్యూ కారుని దీపా కర్మార్కర్ వెనక్కి ఇచ్చేస్తానని చేసిన ప్రకటనపై త్రిపుర ప్రభుత్వం మండిపడింది. అక్కడి ప్రభుత్వ అధికారులు సైతం దీపా ఆలోచనపై మండిపడుతున్నారు. రోడ్లు సరిగా లేవన్న కారణంతో కానుకగా వచ్చిన కారును తిరిగి ఇచ్చివేయాలన్న ఆలోచన కరెక్టు కాదని అంటున్నారు.

అలా చేస్తే తమ రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందని అనుకున్న అధికారులు, దీపా నివాసానికి దగ్గర, సమీపంలోని రోడ్లకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ విషయాన్ని త్రిపుర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఇంజనీర్ సోమేష్ చంద్రదాస్ వెల్లడించారు. మరోవైపు దీపా నిర్ణయంపై త్రిపుర రోడ్లు, రవాణా శాఖ మంత్రి బాదల్ చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కారు కోసం రాష్ట్రాన్ని కించపరుస్తావా!: దీపాపై త్రిపుర సర్కార్‌ ఫైర్ కారు కోసం రాష్ట్రాన్ని కించపరుస్తావా!: దీపాపై త్రిపుర సర్కార్‌ ఫైర్

త్రిపురలోని రోడ్లపై రాష్ట్రపతి, ప్రధాని సహా విదేశీ ప్రముఖుల కార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తిరిగాయని ఆయన గతవారంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అగర్తలలోని రోడ్ల తీరుపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం మండిపడుతున్నాయి. రోడ్ల గురించి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X