న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టార్గెటింగ్ పర్‌ఫార్మెన్స్ సెంటర్: ఔత్సాహిక క్రీడాకారుల కోసం బింద్రా ముందుచూపు

By Nageshwara Rao
Abhinav Bindra and SAI launch Targeting Performance Centre

హైదరాబాద్: ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించిన షూటర్ అభినవ్ బింద్రా.. ఔత్సాహిక క్రీడాకారుల కోసం 'టార్గెటింగ్ పర్‌ఫార్మెన్స్ సెంటర్' ప్రారంభించారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో కలిసి బెంగళూరులో 'పదుకోణె-ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్'లో ఈ కేంద్రాన్ని క్రీడాకారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా అభినవ్ బింద్రా మాట్లాడుతూ ఔత్సాహిక క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి, ఒలింపిక్స్ క్రీడలకు అనుగుణంగా ఎదిగేలా ఈ కేంద్రం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ఢిల్లీ, చంఢీగర్‌లో ఇప్పటికే ఉన్న ఇలాంటి కేంద్రాలకు ఇది అదనంగా సేవలు అందింస్తుందని, బెంగళూరువాసులకు ఇది మరింత ప్రయోజనకరమని అన్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇలాంటి కేంద్రాలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని బింద్రా ఈ సందర్భంగా అన్నారు. క్రీడాకారుల కోసం ప్రపంచస్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారంటూ అభినవ్ బింద్రాకు ప్రకాష్ పదుకొణె అభినందనలు తెలిపారు.

Abhinav Bindra and SAI launch Targeting Performance Centre

దేశంలో క్రీడలను మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ 'రిటైర్మెంట్ అయ్యే నాటికి ఆ తర్వాత ఏంచేయాలనే దానిపై నాకు స్పష్టత లేదు. కానీ, బింద్రా చాలా వేగంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని మంచిపని చేశారు. ఓ టెస్ట్ బ్యాట్స్‌మన్‌కు, షూటర్‌కు తేడా ఇదేనేమో' అని అన్నాడు.

శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్, దేవేంద్ర ఝఝారియాలు పాల్గొన్నారు. టార్గెటింగ్ పర్‌ఫార్మెన్స్ సెంటర్‌కు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ దీనికి నిధులు సమకూరుస్తుంది

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 17, 2017, 14:43 [IST]
Other articles published on Dec 17, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X