ట్విట్టర్ అకౌంట్ హాక్: బింద్రా ఖాతాలో ఉగ్రవాదుల ట్వీట్

Posted By: Subhan
Abhinav Bindra's Twitter Account Hacked: Reports

హైదరాబాద్: ప్రముఖ భారత షూటర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారతదేశానికి బంగారు పతకం అందించిన ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. హ్యాకర్లు కేవలం అతని అకౌంట్‌ను హ్యాక్ చేయడంతోనే సరిపెట్టుకోకుండా కొన్ని ట్వీట్లు చేయడం గమనార్హం.

అందులో ఒకటి 'ఆపరేషన్ ఇన్ ఆఫ్రిన్, ఐ సపోర్టు టర్కీ' అని పేర్కొన్నారు. అభినవ్ బింద్రా అకౌంట్ హ్యాక్ కావడంతో తాత్కాలికంగా దానిని నిలుపుదల చేశారు. అయితే, ఈ విషయంలో బాధితుడు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా కొన్ని వారాల కిందట కూడా ఇలాగే అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ అకౌంట్ హాక్ అయిన వాళ్లలో బింద్రా తొలి వ్యక్తేం కాదు. ఇంతకు ముందు అనుపమ్ ఖేర్, అభిషేక్ బచ్చన్, స్వపన్ దాస్‌గుప్తా, రామ్ మాధవ్, కిరణ్ బేడి, ప్రీతిష్ నందీల ఖాతాలు కూడా హాక్ చేయబడ్డాయి. ఈ సైబర్ నేరాలన్నీ 'టర్కీష్ సైబర్ ఆర్మీ' చేస్తున్నట్లుగా సమాచారం.

జపాన్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ యోనెక్స్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని శనివారం వెల్లడించింది. అయితే కొద్ది గంటల్లోనే అది దానిని సరిచేయడంతో సదరు సంస్థ దానిని పునరుద్ధరించింది. అకౌంట్ హాక్ చేసి పీవీ సింధుకు సాయం చేయబోమంటూ వార్తలు వెలువరించిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 11:51 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి