న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mary Kom: ముగ్గురు పిల్లల తల్లిపై ఒలింపిక్స్ కమిటీ భావోద్వేగ వీడియో: ఇదే చివరిది

A Star Olympian and a super mum: Video of Mary Kom goes viral, Here is what

టోక్యో: మేరీ కోమ్.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు చెందిన బాక్సింగ్ మణిదీపం. 39 సంవత్సరాల వయస్సులో బాక్సింగ్ బరిలో సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ప్రత్యర్థులకు తన పంచ్ రుచి చూపించడానికి సమాయాత్తమౌతోన్నారు. ఈ సాయంత్రం టోక్యో స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకల్లో భాగంగా నిర్వహించే మార్చ్‌పాస్ట్ కార్యక్రమానికి ఆమె నాయకత్వాన్ని వహించనున్నారు. తోటి హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్‌తో కలిసి దేశ జాతీయ పతాకాన్ని అందుకుంటారు. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లకు మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తారు.

మేరీ కోమ్ ముగ్గురు పిల్లల తల్లి. అయినప్పటికీ- ఒలింపిక్స్‌లో పతకాన్ని ఆశించే విభాగంలో బాక్సింగ్ కూడా ఉంది. స్టార్ ఒలింపియన్ హోదాలో టోక్యోలో అడుగు పెట్టారు. సూపర్ మామ్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు ఇదే చివరి ఒలింపిక్స్. తన కెరీర్‌లో చివరి ఒలింపిక్స్‌లో పాల్గొంటోన్నారు. గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలనే కారణంతో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఆమెను నేషనల్ ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒలింపిక్స్ కమిటీ కూడా మేరీకోమ్‌పై ఓ భావోద్వేగాలతో కూడిన ఓ వీడియోను రూపొందించింది.

ముగ్గురు పిల్లలతో కలిసి మేరీ కోమ్ దిగిన కొన్ని గ్రూప్ ఫొటోలు, ఆమె విజయాలను సాధించినప్పటికీ.. క్లిప్పింగులను ఇందులో జత చేసింది. మేరీ కోమ్ ముగ్గురు కొడుకులు తల్లికి బెస్ట్ విషెస్ చెప్పడాన్ని ఇందులో చిత్రీకరించారు. టోక్యో ఒలింపిక్స్ చివరిది కావడంతో- ఆమెకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం ప్రతి క్రీడాకారుడిపైనా ఉందని ఒలింపిక్స్ కమిటీ వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా ఈ వీడియోను షూట్ చేసినట్లు పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ తొలి బౌట్ ఆదివారం మొదలవుతుంది. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ఆమె రింగ్‌లో దిగుతారు.

Story first published: Friday, July 23, 2021, 22:42 [IST]
Other articles published on Jul 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X