న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'కూలీ కొడుకు పతకం పట్టాడు'

A coach’s labour fuels triple-jumper Praveen Chitravel’s Youth Olympic bronze

న్యూఢిల్లీ: యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాకు చెందిన ప్రవీణ్‌ చిత్రవేల్‌ యూత్‌ ఒలింపిక్స్‌లో పతకంతో మెరిశాడు. 17 ఏళ్ల ఈ టీనేజర్‌ పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో కాంస్యం సాధించాడు. స్టేజ్‌-1లో 15.68 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచిన ప్రవీణ్‌.. స్టేజ్‌-2లో 15.84 పాయింట్లతో మూడో స్థానం సాధించాడు. ఉమ్మడిగా 31.52 మీటర్లతో అతను కాంస్య పతకానికి అర్హత సాధించాడు.

 ఒక్కో విభాగం పోటీని రెండుసార్లు

ఒక్కో విభాగం పోటీని రెండుసార్లు

క్యూబాకు చెందిన అలెజాండ్రో డయాజ్‌ (34.18 మీ.), నైజీరియా క్రీడాకారుడు ఇమ్మాన్యుయెల్‌ (31.85 మీ.) తొలి రెండు స్థానాలు సాధించారు. సవరించిన నిబంధనల ప్రకారం.. యూత్‌ ఒలింపిక్స్‌లో నాలుగు కి.మీ. క్రాస్‌కంట్రీ రేస్‌ మినహా ట్రాక్‌, ఫీల్డ్‌ మరే విభాగంలోనూ ఫైనల్స్‌ ఉండవు. ఒక్కో విభాగం పోటీని రెండుసార్లు నిర్వహిస్తారు. రెండు దశల ఫలితాల ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. ప్రవీణ్‌ గెలుపొందిన కాంస్యంతో యూత్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌ ఖాతాలో రెండో పతకం చేరింది.

భారత్‌కిది రెండో పతకం

భారత్‌కిది రెండో పతకం

యూత్‌ ఒలింపిక్స్‌ కొత్త ఫార్మాట్‌ ప్రకారం 4 వేల మీటర్ల క్రాస్‌ కంట్రీ పోటీలో మినహాయిస్తే ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ఫైనల్స్‌ లేవు. ప్రతి ఈవెంటూ రెండు దశల్లో నిర్వహించి రెండు ప్రదర్శనల సగటు ఆధారంగా పతకాలు అందిస్తున్నారు. ఈసారి యూత్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కిది రెండో పతకం. పురుషుల 5 వేల మీటర్ల నడకలో సూరజ్‌ పన్వర్‌ రజతం గెలిచిన సంగతి తెలిసిందే.

 సాయ్‌ కోచ్‌ ఇందిరా సింగ్‌ శిక్షణలో రాటుదేలి

సాయ్‌ కోచ్‌ ఇందిరా సింగ్‌ శిక్షణలో రాటుదేలి

17 ఏళ్ల ప్రవీణ్‌ తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని ఓ పల్లెటూరికి చెందిన వాడు. అతడిది పేద కుటుంబం. తండ్రి దినసరి వ్యవసాయ కూలీ. ప్రవీణ్‌ ఈ ఏడాదే ఆరంభమైన ఖేలో ఇండియా పాఠశాల క్రీడల్లో స్వర్ణం గెలిచి వెలుగులోకి వచ్చాడు. సాయ్‌ కోచ్‌ ఇందిరా సింగ్‌ శిక్షణలో రాటుదేలి యూత్‌ ఒలింపిక్స్‌కు వెళ్లాడు. ఈ ఏడాది నిర్వహించిన తొలి ఖేలో ఇండియా పోటీల్లో స్వర్ణ పతకం అందుకున్న ప్రవీణ్‌.. కోచ్‌ ఇందిరా సింగ్‌ ఆధ్వర్యంలో తన నైపుణ్యానికి పదును పెట్టుకున్నాడు.

కష్టాలు పడుతూనే ప్రవీణ్‌ నెగ్గడం అభినందనీయం

కష్టాలు పడుతూనే ప్రవీణ్‌ నెగ్గడం అభినందనీయం

చెన్నైలోని ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ' (సీఓఏ)లో అతడు ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఇందిర దృష్టిలో పడ్డాడు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి అయిన ఇందిర..‘సీఓఏ'లో అథ్లెటిక్‌ కోచ్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్‌ చిన్న తమ్ముడు కూడా ఇందిరా సింగ్‌ వద్దే శిక్షణ పొందుతున్నాడు. ‘అతడి తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి గృహిణి. ప్రవీణ్‌కు అక్క, తమ్ముడు ఉన్నారు. అతడి తండ్రి సంపాదన ప్రవీణ్‌ శిక్షణకు ఏమాత్రం సరిపోదు. ఇన్ని కష్టాలు పడుతూనే ప్రవీణ్‌ పతకం నెగ్గడం అభినందనీయం' అని ఇందిర చెప్పా రు.

Story first published: Thursday, October 18, 2018, 11:02 [IST]
Other articles published on Oct 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X