న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్వెల్త్‌ గేమ్స్: పతకాలు తెచ్చే ఆ పదిమంది ఎవరో తెలుసా?

By Nageshwara Rao
2018 Commonwealth Games: Indias 10 biggest medal hopes

హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌కు ఇంక ఒక్కరోజే మిగిలి ఉంది. ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్ వేదికగా బుధవారం నుంచి కామన్వెల్త్ గేమ్స్ అధికారికంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం పదకొండు రోజుల పాటు జరిగే ఈ క్రీడలు క్రీడాభిమానులకు ఎంతో వినోదాన్ని పంచనున్నాయి.

నిజానికి కామన్వెల్త్ గేమ్స్ భారత ఆటగాళ్లకు కొట్టిన పిండి. ఒలింపిక్స్‌లో పతకాలు సాధంచడం కష్టమేమో గానీ, ఇందులో మాత్రం భారత్‌ నుంచి విరివిగా పతకాలను ఆశించవచ్చు. గత మూడు ఎడిషన్లలో భారత్‌కు మొత్తం 215 పతకాలు సాధించింది. గతేడాది గ్లాస్గో వేదికగా జరిగిన గేమ్స్‌లో 64 పతకాలు సాధించింది.

అయితే ఇందులో 15 స్వర్ణాలు ఉండటం విశేషం. గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో 225 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య పెరగాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌‌ల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

ఈసారి కచ్చితంగా పతకం పట్టుకొచ్చే వారిలో మేరీకోమ్, సైనా నెహ్వాల్, సంజితా చాను, మొహులీ ఘోష్, వికాస్ క్రిషన్ తదితరులు ఉన్నారు. వీరి గురించి ఒక్కసారిగా తెలుసుకుందాం...

ఈవెంట్‌: మహిళల సింగిల్స్‌

ఈవెంట్‌: మహిళల సింగిల్స్‌

ఇప్పటివరకు ఎన్నిసార్లు పాల్గొన్నది: ఒకసారి

పతకం: కాంస్యం (2014)

2018 గేమ్స్‌లో మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 12, ఉదయం 4.30 గంటలకు

వేదిక: కరారా స్పోర్ట్స్ సెంటర్

గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పతాకధారిగా వ్యవహరించనున్న బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధు ఈసారి స్వర్ణంపైనే గురి పెట్టింది. నాలుగేళ్ల క్రితం గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్న తర్వాత ఆమె ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించడంతో సింధు ఆట శిఖరాగ్రస్థాయికి చేరింది. ఇటీవలే ముగిసిన ఆల్‌ ఇంగ్లాండ్‌ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారిగా సెమీ్‌సకు చేరింది.

ఈవెంట్‌: మహిళల 62 కేజీలు

ఈవెంట్‌: మహిళల 62 కేజీలు

ఇప్పటివరకు ఎన్నిసార్లు పాల్గొన్నది: ఒకసారి

పతకం: రజతం (2014)

2018 గేమ్స్‌లో మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 14, ఉదయం 6 గంటలకు

వేదిక: కరారా స్పోర్ట్స్ సెంటర్

నాలుగేళ్ల క్రితం గ్లాస్గో వేదికగా జరిగిన గేమ్స్‌లో సాక్షి మాలిక్ రజత పతకం సాధించింది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు రియో గేమ్స్‌లో కాంస్యం సాధించి భారత్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. గతేడాది జరిగిన కామన్వెల్త్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణం సాధించగా ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. అయితే, గోల్డ్‌కోస్ట్‌లో మెరిసే అవకాశాలు ఉన్నాయి.

ఈవెంట్‌: జావెలిన్‌ త్రో

ఈవెంట్‌: జావెలిన్‌ త్రో

ఇప్పటిదాకా పాల్గొన్నది: ఇదే తొలిసారి

2018 గేమ్స్‌లో మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 10, మధ్యాహ్నాం 2.30 గంటలకు

వేదిక: కరారా స్పోర్ట్స్ సెంటర్

20 ఏళ్ల నీరజ్‌ చోప్రా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. గతేడాది ఆసియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత చైనాలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రీలో రజతంతో ఐఏఏఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించినా ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోలేకపోయాడు. 2016లో జరిగిన అండర్‌-20 చాంపియన్‌షిప్స్‌లో 86.48మీ. దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇక గత నెలలో జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో 85.94మీ. దూరం విసిరాడు.

ఈవెంట్‌: మహిళల 45-48 కేజీ

ఈవెంట్‌: మహిళల 45-48 కేజీ

ఇప్పటిదాకా పాల్గొన్నది: ఇదే తొలిసారి

మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 16, మధ్యాహ్నాం 2.02 గంటలకు

వేదిక: ఓక్సన్ ఫోర్డ్ స్టూడియోస్

మేరీ కోమ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తనకు ఈ గేమ్స్‌లో పతకం లోటుగానే ఉంది. కెరీర్‌ చివరిదశలో ఉన్న మేరీకి దాదాపుగా ఇదే చివరి కామన్వెల్త్‌గా చెప్పవచ్చు. గతేడాది తిరిగి బాక్సింగ్‌ బరిలో నిలిచిన 35 ఏళ్ల కోమ్‌ ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో ఐదోసారి స్వర్ణం సాధించింది.

ఈవెంట్‌: మహిళల సింగిల్స్‌

ఈవెంట్‌: మహిళల సింగిల్స్‌

ఇప్పటిదాకా పాల్గొన్నది: రెండుసార్లు

పతకం: కాంస్యం (2006), స్వర్ణం, రజతం (2010)

మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 12, మధ్యాహ్నాం ఒంటి గంటకు

వేదిక: కరారా స్పోర్ట్స్ సెంటర్

గాయం కారణంగా 2014 గ్లాస్గో గేమ్స్‌లో సైనా నెహ్వాల్ పాల్గొనలేదు. ఈ మధ్య కాలంలో సైనా నెహ్వాల్‌ను సింధు వెనక్కినెట్టింది. అయితే గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్లో సైనా కాంస్యం, గ్రాండ్‌ప్రీ స్వర్ణం, మూడో జాతీయ టైటిల్‌ను సాధించి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది. తిరిగి గోపీచంద్‌ అకాడమీలో చేరిన తర్వాత ఆమె ఫిట్‌నెస్‌ కూడా బాగా మెరుగుపడి ప్రధాన పోటీదార్లలో ఒకరిగా నిలిచింది.

ఈవెంట్‌: పురుషుల 10మీ, 50మీ. పిస్టల్‌

ఈవెంట్‌: పురుషుల 10మీ, 50మీ. పిస్టల్‌

ఇప్పటిదాకా పాల్గొన్నది: ఒకసారి

పతకం: స్వర్ణం (2014)

మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 9, 11, సాయంత్రం 4.30 గంటలకు

వేదిక: బెల్మోంట్ షూటింగ్ సెంటర్

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు పతకాలు ఎక్కువగా వచ్చే ఈవెంట్ షూటింగ్‌. ఇప్పటికి 56 స్వర్ణాలతో అదరగొట్టిన ఈ ఈవెంట్‌లో అందరికన్నా అనుభవశాలి జీతూ రాయ్‌పై కూడా అంచనాలు అధికంగా ఉన్నాయి. 2016 రియో గేమ్స్‌లో తను నిరాశపరిచాడు. అయితే గతేడాది పుంజుకుని ఐఎస్ఎస్ఎఫ్‌ షూటింగ్‌ లో నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం.. కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్లో రెండు కాంస్యాలు సాధించాడు.

ఈవెంట్‌: పురుషుల సింగిల్స్‌;

ఈవెంట్‌: పురుషుల సింగిల్స్‌;

ఇప్పటిదాకా పాల్గొన్నది: ఒకసారి

మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 12, మద్యాహ్నాం ఒంటి గంటకు

వేదిక: కరారా స్పోర్ట్స్ సెంటర్

గతేడాది శ్రీకాంత్‌ ఏకంగా నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లను గెలిచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గ్లాస్గో గేమ్స్‌కు ముందు అనారోగ్యం అతడిని ఇబ్బందిపెట్టడంతో పెద్దగా రాణించలేకపోయాడు. కానీ ఈసారి ప్రపంచ రెండో ర్యాంకర్‌గా శ్రీకాంత్‌ బరిలోకి దిగబోతున్నాడు. క్రితంసారి పారుపల్లి కశ్యప్‌ స్వర్ణం సాధించగా ఈసారి శ్రీకాంత్‌ రూపంలో భారత్‌కే పోడియం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ఈవెంట్‌: మహిళల 53 కేజీ

ఈవెంట్‌: మహిళల 53 కేజీ

ఇప్పటిదాకా పాల్గొన్నది: ఒకేసారి

పతకం: స్వర్ణం (2014)

మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 6, ఉదయం 5 గంటలకు

వేదిక: కరారా స్పోర్ట్స్ సెంటర్

సంజితా చాను డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగబోతోంది. ప్రస్తుతం ఆమె అద్భుతమైన ఫామ్‌లో ఉంది. 2017లో కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో స్వర్ణం సాధించి కరణం మల్లీశ్వరి తర్వాత ఈ ఫీట్‌ సాధించిన లిఫ్టర్‌గా ఖ్యాతికెక్కింది. తన విభాగంలో 194 కేజీల బరువెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ఈవెంట్‌: మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌

ఈవెంట్‌: మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌

ఇప్పటిదాకా పాల్గొన్నది: ఇదే తొలిసారి

మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 9, ఉదయం 4.30 గంటలకు

వేదిక: బెల్మోంట్ షూటింగ్ సెంటర్

మెక్సికోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్‌ ప్రపంచకప్‌లో రెండు కాంస్యాలు గెలిచింది. 17 ఏళ్ల మెహులీ ఘోష్‌ భారత షూటింగ్‌లో రైజింగ్‌ స్టార్‌గా చెప్పుకోవచ్చు. 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మీట్‌లో తన నైపుణ్యాన్ని మరోసారి చాటుకునేందుకు కామన్వెల్త్‌ను చక్కటి వేదికగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. గత ఆరు నెలల నుంచి తన అద్భుత ప్రదర్శన కారణంగా ఈసారి గేమ్స్‌లో మెహులీపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు.

ఈవెంట్‌: పురుషుల 69కేజీ;

ఈవెంట్‌: పురుషుల 69కేజీ;

ఇప్పటిదాకా పాల్గొన్నది: తొలిసారి

మ్యాచ్ ఎప్పడంటే: ఏప్రిల్ 5, ఉదయం 9.17 గంటలకు

వేదిక: ఓక్సన్ ఫోర్డ్ స్టూడియోస్

ఏడాది కాలంగా గాయాలతో బాధపడుతున్నాడు. అయితే, భారీ అంచనాలతో తొలిసారిగా కామన్వెల్త్‌లో అడుగుపెడుతున్నాడు. ఈ ఏడాది స్ట్రాండ్జా స్మారక టోర్నమెంట్‌లో స్వర్ణంతో సత్తా చాటాడు. అంతేకాకుండా ఈ పోటీల్లో ఉత్తమ బాక్సర్‌గా నిలిచిన తొలి భారత బాక్సర్ ఇతడే కావడం విశేషం.

Story first published: Tuesday, April 3, 2018, 12:00 [IST]
Other articles published on Apr 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X