న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భద్రతాపరమైన ముప్పు ఉంటే పాకిస్తాన్‌కు వచ్చేవాడిని కాదు: మైఖేల్ హోల్డింగ్

Michael Holding visited Shahid Afridis residence in Karachi for dinner with Saeed Anwar


కరాచి:
పాకిస్తాన్‌లో పర్యటించాలంటే భద్రతాపరమైన ముప్పు ఉంటే ఇక్కడికి వచ్చే వాడిని కాదు అని లెజెండరీ వెస్టిండీస్ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత మైఖేల్ హోల్డింగ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్‌, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది దిగ్గజం మైఖేల్ హోల్డింగ్‌కు డిన్నర్ ఇచ్చారు. కరాచీలోని తన నివాసంలో ఆదివారం రాత్రి అఫ్రిది విందును ఏర్పాటు చేసాడు. ఈ విందులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ కూడా పాల్గొన్నాడు.

IND vs SA: తొలి టెస్ట్ కోసం టీమిండియా తుది జట్టు ఇదే?.. పంత్‌కు చోటు కష్టమే!!IND vs SA: తొలి టెస్ట్ కోసం టీమిండియా తుది జట్టు ఇదే?.. పంత్‌కు చోటు కష్టమే!!

ఈ సందర్భంగా మైఖేల్ హోల్డింగ్‌ మాట్లాడుతూ... 'పాకిస్తాన్‌లో పర్యటించాలంటే భద్రతాపరమైన భయం ఉంటే ఇక్కడికి వచ్చే వాడిని కాదు. నాకు ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటానికి శ్రీలంక రావడం ప్రోత్సాహకరమైన విషయం. భద్రతా జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి దేశం యొక్క మొదటి ప్రాధాన్యత. పాకిస్థాన్ ఇందుకు భిన్నమేమీ కాదు. పదేళ్ల క్రితం జరిగిన ఘటన కారణంగా పాకిస్తాన్‌లో పర్యటించకపోవడం మంచి పద్దతి కాదు. ఇక్కడ మరిన్ని మ్యాచులు జరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌కు తిరిగి రావడం చాలా బాగుంది. ఇక్కడ ఆహారం, ఆతిథ్యం చాలా బాగున్నాయి. కరాచీలో గత రెండు రోజులుగా వాతావరణం మెరుగుపడింది. జావేద్ మియాండాద్, జహీర్ అబ్బాస్ లాంటి ఇతర పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళను కలుసుకోవడం సంతోషంగా ఉంది' అని అన్నారు.

విందుకు సంబందించిన ఫొటోలను అఫ్రిది తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'మైఖేల్ హోల్డింగ్‌కు నా ఇంటిలో విందు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా. హోల్డింగ్‌ ఈ విందుకు వచ్చేలా సహకరించిన డాక్టర్ కాశీఫ్‌కు ధన్యవాదాలు. మాతో కలిసిన సయీద్ అన్వర్‌కు కృతజ్ఞతలు. నన్ను దిగ్గజాలు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది' అని అఫ్రిది పేర్కొన్నాడు. అక్టోబర్ 2న కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగే మూడవ వన్డేకు అఫ్రిది హాజరుకానున్నాడు.

పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రైద్దెన విషయం తెలిసిందే. భారీ వర్షం కురవడంతో మైదానం మొత్తం చెరువులా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే వేదికగా ఆదివారం జరగాల్సిన రెండో వన్డేకు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉండటంతో ముందు జాగ్రత్తగా మ్యాచ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆదివారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌ సోమవారం (సెప్టెంబర్‌ 30) జరగనుంది. ఇదే విషయాన్ని ఐసీసీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

Story first published: Monday, September 30, 2019, 13:42 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X