న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'తక్షణమే ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేయాలి'

By Nageshwara Rao
veteran kabaddi players demand to dissolve ap kabaddi association

హైదరాబాద్: ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేయాలని వెటరన్‌ కబడ్డీ క్రీడాకారులు డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలోని రైల్వే ఇనిస్టిట్యూట్ ఆడిటోరియంలో సమావేశమైన వెటరన్‌ కబడ్డీ క్రీడాకారులు ఇటీవల కాలంలో మహిళా క్రీడాకారిణుల పట్ల లైంగిక వేధింపులపై స్పందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ అసోసియేషన్‌లో వెలుగు చూసిన ఆరోపణలు తమను తీవ్రంగా బాధించాయని అన్నారు. తమకు అన్యాయం జరిగిందని, అసోసియేషన్ పెద్దలు తమను వేధిస్తున్నారని ఆడపిల్లలు బయటికొచ్చి చెప్పడం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

ఆయన మా జీవితాలతో ఆడుకున్నాడు, లైంగిక వేధింపులు,హత్యలు కూడా: కబడ్డీ క్రీడాకారిణుల ఆరోపణలు

veteran kabaddi players demand to dissolve ap kabaddi association

దీనికి గాను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేయడమే ఉత్తమమైన మార్గమని వారు సూచించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరలంకయ్యనే కబడ్డీ సంఘం కార్యదర్శిగా తిరిగి నియమించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

బాధితులకు అండగా ఉన్న శ్రీకాంత్‌ను జిల్లా అసోసియేషన్‌ను తొలగించిన పెద్దలు.. వీర లంకయ్యపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. మహిళా క్రీడాకారుల ఆరోపణలపై కమిటీని కూడా వేయకుండా వీర లంకయ్యను వెనుకేసుకొస్తున్నారని వారు మండిపడ్డారు. ఏపీ కార్యదర్శి హోదాలో వీర లంకయ్య అనేక అక‍్రమాలకు పాల్పడటం నిజమని అన్నారు.

జిల్లా అసోసియేషన్‌ను రద్దు చేసిన పెద్దలు.. తక్షణమే ఏపీ అసోసియేషన్‌ను చేయాలని వారు కోరారు. అధికారం, డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చని చెప్పేందుకు ఈ ఘటనే ఉదాహరణ అని అన్నారు. ఆడపిల్లలు రోడ్డెక్కి తమ ఆవేదనను వెళ్లగక్కినప్పటికీ, పట్టించుకోకుండా నిందితుడిగా ఉన్న వ్యక్తికి అండగా నిలవడం బాధాకరమని అన్నారు.

Story first published: Saturday, May 26, 2018, 14:56 [IST]
Other articles published on May 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X