న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూపీ యోధాతో తెలుగు టైటాన్స్ పోరు సమం

Pro Kabaddi 2018 : UP Yoddha vs Telugu Titans Match Highlights | Oneindia Telugu
UP Yoddha and Telugu Titans settle for a tie

గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. టోర్నీ ముందుకు సాగుతున్న కొద్ది పోటీలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే క్రమంలో పాయింట్ల కోసం ఆఖరి నిమిషం దాకా కసిగా పోరాడుతున్నారు. మంగళవారం తెలుగు టైటాన్స్, యూపీ యోధా జట్ల మధ్య జరిగిన మ్యాచే దీనికి నిదర్శనం.

ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ తొలి 'డ్రా' నమోదు చేసుకుంది. మంగళవారం టైటాన్స్, యూపీ యోధా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు చివరకు 26-26తో 'డ్రా'గా ముగిసింది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్‌ ఈ మ్యాచ్‌లో ఆ జోరు కనబర్చలేకపోయింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి (3 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో టైటాన్స్‌ తొలి అర్ధభాగంలో 10-19తో వెనుకబడింది.

రెండో సగంలో ఇటు రైడింగ్‌లో, అటు ట్యాక్లింగ్‌లో అద్భుతంగా చెలరేగిన టైటాన్స్‌ చూస్తుండగానే మ్యాచ్‌పై పట్టు సాధించింది. నీలేశ్, మొహ్‌సిన్, అబోజర్‌ నాలుగేసి పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున సచిన్‌ కుమార్‌ 5, శ్రీకాంత్, రిశాంక్‌ దేవడిగ చెరో 4 పాయింట్లు సాధించారు. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో మ్యాచ్ 26-26 స్కోరుతో సమమైంది. టైటాన్స్ తరఫున రైడింగ్‌లో నీలేశ్ సాలుంకే(3), డిఫెన్స్‌లో అబోజర్ మిగానీ(4) రాణించారు.

యూపీ జట్టులో శ్రీకాంత్‌జాదవ్(4), నితీశ్ కుమార్(4) ఆకట్టుకున్నారు. టైటాన్స్ జట్టులో అబోజర్ మిగానీ డిఫెన్స్‌లో కీలక పాయింట్లతో అదరగొట్టగా, రైడింగ్‌లో టైటాన్స్ అంతగా పాయింట్లు దక్కించుకోలేకపోయింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 38-32 తేడాతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. దీపక్‌హుడా(12), మోహిత్ చిల్లార్(4) జైపూర్ విజయంలో కీలకమయ్యారు.

మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 38-32తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్‌ ఢిల్లీ, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్‌ తలపడతాయి.

Story first published: Wednesday, November 7, 2018, 9:47 [IST]
Other articles published on Nov 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X