న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తమిళ తలైవాస్ vs పట్నా పైరేట్స్: గెలుపు రుచి చూసేదెవరు?

Raiding extravaganza on the cards as Tamil Thalaivas take on Patna Pirates

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో శనివారం నుంచి కోల్‌కతా అంచె పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా సోమవారం తమిళ తలైవాస్‌తో పట్నా పైరేట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

పీకేల్-7లో వరుసగా 12వ సూపర్-10 నమోదు చేసిన రైడర్ ఎవరో తెలుసా?పీకేల్-7లో వరుసగా 12వ సూపర్-10 నమోదు చేసిన రైడర్ ఎవరో తెలుసా?

టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన తమిళ తలైవాస్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి 27 పాయింట్లతో పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతుండగా... పట్నా పైరేట్స్ కూడా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 20 పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉంది.

ఈ రెండు జట్లు గత ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ను ఎంతో సీరియస్‌గా తీసుకున్నాయి. ఆదివారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తమిళ తలైవాస్ 16 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో ఆశలన్నీ స్టార్ రైడర్ రాహుల్ చౌదరిపైనే పెట్టుకుంది.

ముఖ్యంగా గత మ్యాచ్‌లో రాహుల్ చౌదరి సూపర్-10తో మెరవగా, మరో రైడర్ అజిత్ కుమార్ సైతం 9 రైడ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో పట్నాతో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు రుచిని చూడాలని తమిళ తలైవాస్ భావిస్తోంది.

తమిళ తలవాస్:
ఆడినవి: 14
గెలిచినవి: 3
టై: 2
ఓడినవి: 9
విన్ రేట్: 21.43%
బెస్ట్ రైడర్: రాహుల్ చౌదరి
బెస్ట్ డిఫెండర్: మన్జీత్ చిల్లర్

ఇక, పట్నా పైరేట్స్ విషయానికి వస్తే ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు విన్ పర్సంటేజి 23 శాతంగా ఉంది. పర్దీవ్ నర్వాల్ ఆకట్టుకుంటున్నా... జట్టులోని మిగతా వారి నుంచి ఆతడికి సరైన మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా పట్నా పైరేట్స్ డిఫెన్స్ విఫలమవుతోంది.

'టెస్ట్ ఫార్మాట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్ అని కోహ్లీ ఇప్పటికే నిరూపించాడు''టెస్ట్ ఫార్మాట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్ అని కోహ్లీ ఇప్పటికే నిరూపించాడు'

పట్నా పైరేట్స్

ఆడినవి: 13
గెలిచినవి: 3
టై: 0
ఓడనవి: 10
విన్ రేట్: 23.08%
బెస్ట్ రైడర్: పర్దీప్ నర్వాల్
బెస్ట్ డిఫెండర్: జైదీప్

Story first published: Monday, September 9, 2019, 16:23 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X