న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రొ కబడ్డీ: తెలుగు టైటాన్స్ పూర్తి జట్టు వివరాలు

Pro Kabaddi League Telugu Titans final squad auction 2018

హైదరాబాద్: మునుపెన్నడూ లేనంతగా తెలుగు కుర్రాళ్లు వేలంలో మంచి రేటు కొట్టేశారు. సి-గ్రేడ్‌ ప్లేయర్ల జాబితా నుంచి ఎమ్‌. మహేందర్‌ రెడ్డి, సి. మనోజ్‌ కుమార్‌లను తెలుగు టైటాన్స్‌ చెరో 8 లక్షలకు సొంతం చేసుకుంది. అలాగే, గంగాధరి మల్లేశం, ఎన్‌. శివరామ కృష్ణను జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ అదే రేటుకు కొనుగోలు చేసింది. ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మహేందర్‌ రెడ్డి చాలా ఏళ్ల నుంచి భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

అతను ఆల్‌రౌండర్‌. ఇక, కృష్ణా జిల్లా కోడూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన 26 ఏళ్ల డిఫెండర్‌ మనోజ్‌ కుమార్‌ 2016 ఆసియా కబడ్డీ చాంపియన్‌షి్‌పలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ కబడ్డీ టోర్నీలో రాణించి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అతనితో పాటు ఆసియా క్రీడల కబడ్డీ టీమ్‌ క్యాంప్‌లో ఉన్న రైడర్‌ మల్లేశంను కూడా అదృష్టం వరించింది.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మల్లేశం ఈ మెగా లీగ్‌ తొలి మూడు సీజన్లలో జైపూర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రెండు సీజన్ల విరామం తర్వాత అదే జట్టుకు ఎంపికై సత్తా చాటుకున్నాడు. ఇక, నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన ఎన్‌. శివరామ కృష్ణ తొలిసారి మెగా లీగ్‌లోకి అడుగుపెట్టాడు.

PKL

ఆంధ్రాబ్యాంక్‌లో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈ ఆల్‌రౌండర్‌ 2006 నుంచి ఉమ్మడి ఏపీ, తెలంగాణ తరఫున 12 నేషనల్స్‌లో పాల్గొన్నాడు. కాగా, తెలుగు ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి, ఫ్రాంచైజీల దృష్టికి తేవడంలో కోచ్‌ శ్రీనివా్‌సరెడ్డి కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను జైపూర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

తెలుగు టైటాన్స్‌ జట్టు
Raiders:

నీలేష్‌ సాలుంకె [Retained] - ₹56.87 lakh

మొహసిన్‌ [Retained] - ₹24.55 lakh

రాహుల్‌ చౌదరి - ₹129 lakhs

కమల్‌ సింగ్‌ [NYP] - ₹6.6

రక్షిత్‌ [NYP] - ₹6.6 lakh

అంకిత్‌ [NYP] - ₹6.6 lakh

ఆనంద్ [NYP] - ₹6.6 lakh

Defenders:

విశాల్‌ భరద్వాజ్‌ [Retained] - ₹6.6 lakh

అబోజర్‌ మిఘాని - ₹76 lakh

ఫర్హద్‌ - ₹21.5 lakh

రాకేష్‌ సింగ్‌ - ₹12 lakh

సంకేత్‌ - ₹8 lakh

డి. గోపు - ₹8 lakh

మనోజ్‌ కుమార్‌ - ₹8 lakh

అనూజ్‌ - ₹5 lakh

దీపక్‌ - ₹5 lakh

All-rounders:

మహేందర్‌ రెడ్డి - ₹8 lakh

అర్మాన్‌ - ₹5 lakh

Story first published: Friday, June 1, 2018, 18:09 [IST]
Other articles published on Jun 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X