న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠ, ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్

Pro Kabaddi League 2018 Highlights Jaipur Pink Panthers vs Dabang Delhi: Match ends in a tie

పంచకుల: ప్రొ కబడ్డీ ఆరో సీజన్‌లో జైపుర్‌ పింక్‌పాంథర్స్‌ వరుసగా రెండో మ్యాచ్‌ను టైగా ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్‌ ఢిల్లీ, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ మధ్య జోన్‌-ఎ మ్యాచ్‌ 37-37తో టైగా ముగిసింది. జైపూర్‌ ప్లేయర్‌ సెల్వమణి ఒక రైడ్‌లో నాలుగు పాయింట్ల తేవడం మ్యాచ్‌కే హైలైట్‌ కాగా.. డిఫెండర్‌గా సందీప్‌ ధుల్‌ ఆరు పాయింట్లతో అదరగొట్టాడు. మ్యాచ్‌ ఆరంభంలో దూకుడుగా ఆడిన ఢిల్లీ 4 నిమిషాలు ముగిసే సరికి 5-0తో ఆధిక్యం సాధించింది.

దీపక్‌ హుడా (8) రైడింగ్‌లో రాణించి పాయింట్లు తేవడంతో పుంజుకున్న జైపుర్‌ 7-7తో స్కోరు సమం చేసింది. ఇక అక్కడి నుంచి జైపుర్‌ తరపున సెల్వమణి (11).. ఢిల్లీ జట్టులో చంద్రన్‌ రంజిత్‌ (11) పోటీ పడి పాయింట్లు తేవడంతో స్కోరు సమం అవుతూనే వచ్చింది. ఢిల్లీ 18-17తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత కూడా ఇరు జట్లు అదే పోరాటాన్ని ప్రదర్శించాయి. ఢిల్లీ వరుసగా పాయింట్లు కొల్లగొట్టి ఆధిక్యం సాధించినా.. వెంటనే జైపుర్‌ ఆటగాళ్లు స్కోరు సమం చేస్తూ వచ్చారు.

11వ నిమిషంలో జైపూర్‌ను ఆలౌట్‌ చేసి 11-7తో ఆధిక్యం సాధించింది. కానీ 13వ నిమిషంలో సెల్వమణి రైడ్‌తో జైపూర్‌ పుంజుకుంది. కానీ ఫస్టాఫ్‌ ముగిసే సమయానికి ఢిల్లీ 18-17తో నిలిచింది. 21వ నిమిషంలో పవన్‌ కడియాన్‌ రైడ్‌తో ఢిల్లీ 21-18తో ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. 24వ నిమిషంలో సెల్వమణి అద్భుతంగా రైడ్‌ చేసి నాలుగు పాయింట్లు తేవడంతో జైపూర్‌ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది.

చివరి 3 నిమిషాల ఆట మిగిలి ఉందనగా ఢిల్లీ 35-31తో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌ గెలిచేలా కనిపించింది. 38వ నిమిషంలో ఢిల్లీని ఆలౌట్‌ చేసి 35-36తో నిలిచింది. కానీ అప్పుడే ఢిల్లీని ఆలౌట్‌ చేసి జైపుర్‌ 36-36తో స్కోరు సమం చేసింది. ఆఖరి రైడ్‌లో దీపక్‌ హుడా పాయింట్‌ తేవడంతో పాంథర్స్‌ డ్రాతో గట్టెక్కింది.చివరకు మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది.

Story first published: Friday, December 21, 2018, 10:28 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X