న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రొ కబడ్డీ: తొలి రోజు వేలంలో అంచనాలు తారుమారు, కోట్ల దాటుతున్న రేట్లు

Pro Kabaddi League 2018 Auction, Day 1: Full list of players sold

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం కొత్త శిఖరాల్ని తాకింది. లీగ్‌ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లకు రికార్డు రేట్లు పలికాయి. ఐదు నెలల తర్వాత జరగబోయే ఆరో సీజన్‌ కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వేలం బుధవారం ముంబైలో మొదలైంది. తొలి రోజు కొందరు ఆటగాళ్లకు కళ్లు చెదిరే రేటు పలికింది. ముఖ్యంగా రైడర్లకు వేలంలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

మోను గోయత్‌ను హరియాణా స్టీలర్స్‌ జట్టు ఏకంగా రూ.1.51 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇంకో ముగ్గురు రైడర్లకు కూడా కోట్లల్లో ధర పలికింది. తెలుగు టైటాన్స్‌ స్టార్‌ రాహుల్‌ చౌదరి ఎప్పట్లాగే ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. అతడి కోసం గట్టి పోటీ నెలకొనగా మళ్లీ టైటాన్సే అతడిని రూ.1.29 కోట్లకు సొంతం చేసుకుంది. తొలి రోజు రెండో అత్యధిక ధర అతడికే దక్కింది.

 కోట్లలో రేట్లు.. టాప్ లేపుతున్న కూతల రాయుళ్లు:

కోట్లలో రేట్లు.. టాప్ లేపుతున్న కూతల రాయుళ్లు:

రైడర్లే అయిన నితిన్‌ తోమర్‌ (రూ.1.15 కోట్లు-పుణెరి పల్టాన్‌), రిషాంక్‌ దేవడిగ (రూ.1.11 కోట్లు-యూపీ యోధా) మంచి రేటు దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్‌ దీపక్‌ నివాస్‌ హుడా (రూ.1.15 కోట్లు-జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌) కూడా కోటీశ్వరుడయ్యాడు. వేలంలో అందరి కంటే ముందు రూ.కోటి క్లబ్బులో చేరిన ఆటగాడు ఫాజెల్‌ అత్రాచలి. డిఫెండర్లలో కోటి రేటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు కూడా అతనే. అతణ్ని యు ముంబా కొనుగోలు చేసింది. ఇరాన్‌కు చెందిన ఫాజెల్‌ గత సీజన్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అబోజర్‌ మిఘాని (రూ.76 లక్షలు-తెలుగు టైటాన్స్‌), సురేందర్‌ నడా (రూ.75 లక్షలు-హరియాణా), సందీప్‌ ధూల్‌ (రూ.66 లక్షలు-జైపూర్‌), దీపక్‌ నర్వాల్‌ (రూ57 లక్షలు-పట్నా పైరేట్స్‌) కూడా మంచి రేటు దక్కించుకున్నారు.

మోహిత్‌ చిల్లర్‌ తక్కువ ధరకే :

మోహిత్‌ చిల్లర్‌ తక్కువ ధరకే :

కొందరు స్టార్లు మత్రం తక్కువ ధరకే ఫ్రాంఛైజీల సొంతమయ్యారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మోహిత్‌ చిల్లర్‌ గురించే. అతను రూ.21 లక్షలకే జైపూర్‌ సొంతమయ్యాడు. మన్‌జీత్‌ చిల్లర్‌ను రూ.20 లక్షలకే తమిళ్‌ తలైవాస్‌ దక్కించుకుంది. అనూప్‌ కుమార్‌ను రూ.30 లక్షలకు జైపూర్‌ కొనుక్కుంది. తొలి ఐదు సీజన్లలో 8 జట్లే పోటీ పడగా.. గత సీజన్‌లో నాలుగు జట్లు అదనంగా లీగ్‌లోకి వచ్చాయి. వేలం గురువారం కూడా కొనసాగనుంది.

మోను గోయత్‌‌కు అందుకే అంత ధర

మోను గోయత్‌‌కు అందుకే అంత ధర

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఆరో సీజన్‌ కోసం జరుగుతున్న వేలంలో రాహుల్‌ చౌదరీ, దీపక్‌ హుడా లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఎక్కువ ధర లభిస్తుందని అందరూ అనుకున్నారు. ముందుగా వేలానికి వచ్చిన రాహుల్‌, దీపక్‌లకు అనుకున్నట్లే అప్పటివరకూ అత్యధిక ధర దక్కింది. అయితే చివరి నిమిషాల్లో వేలానికి వచ్చిన మోను గోయత్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అనుకోని రీతిలో పీకేఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

రైడర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచి:

రైడర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచి:

హరియాణాకు చెందిన ఈ రైడర్‌.. ఈ స్థాయిలో ధర దక్కించుకోవడానికి కారణం డూ ఆర్‌ డైలో అతని ప్రదర్శనే. కచ్చితంగా పాయింట్‌ తీసుకురాగల సత్తా ఉండటంతోనే హరియాణా స్టీలర్స్‌ అంత చెల్లించి మరీ సొంతం చేసుకుంది. గత పీకేఎల్‌ సీజన్‌లో డూ ఆర్‌ డై రైడ్‌లలో 25 పాయింట్లు సాధించాడు. గత సీజన్‌లో పట్నా పైరేట్స్‌ తరపున ఆడిన మోను జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 202 పాయింట్లతో గత సీజన్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన రైడర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.

కోటీశ్వరులు వీళ్లే..

కోటీశ్వరులు వీళ్లే..

1. మోను గోయత్‌ - రూ.1.51 కోట్లు

జట్టు: హరియాణా స్టీలర్స్‌ (రైడర్‌)

2. రాహుల్‌ చౌదరి - రూ.1.29 కోట్లు

జట్టు: తెలుగు టైటాన్స్‌ (రైడర్‌)

3. దీపక్‌ నివాస్‌ హుడా - రూ.1.15 కోట్లు

జట్టు: జైపూర్‌ (ఆల్‌రౌండర్‌)

4. నితిన్‌ తోమర్‌ - రూ.1.15 కోట్లు

జట్టు: పుణెరి పల్టాన్‌ (రైడర్‌)

5. రిషాంక్‌ దేవడిగ - రూ.1.11 కోట్లు

జట్టు: యూపీ యోధా (రైడర్‌)

6. ఫాజెల్‌ అత్రాచలి - రూ.1 కోటి

జట్టు: యు ముంబా (డిఫెండర్‌)

Story first published: Friday, June 1, 2018, 10:11 [IST]
Other articles published on Jun 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X