ప్రో కబడ్డీ: ఢిల్లీపై బుల్స్ విజయం, ప్లే ఆఫ్ ఆశలు సజీవం

Posted By:

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 35-32 తేడాతో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు ఫేల్ ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌ ఆరంభం నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించిన బెంగళూరు చివరివరకు దానిని కొనసాగించింది.

 బెంగళూరు విజయంలో రైడర్లదే కీలక పాత్ర

బెంగళూరు విజయంలో రైడర్లదే కీలక పాత్ర

ముఖ్యంగా రైడర్లు రోహిత్‌ కుమార్‌ 12, అజయ్‌ కుమార్‌ 10 పాయింట్లతో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు బుల్స్ సాధించిన మొత్తం పాయింట్లలో దాదాపు మూడింట రెండో వంతు పాయింట్లు వీళ్లిద్దరివే కావడం విశేషం.

 23 రైడ్, 7 ట్యాకిల్‌ పాయింట్లు సాధించిన బెంగళూరు

23 రైడ్, 7 ట్యాకిల్‌ పాయింట్లు సాధించిన బెంగళూరు

ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 23 రైడ్, 7 ట్యాకిల్‌ పాయింట్లు సాధించింది. ఇరుజట్లు చెరో రెండు సార్లు ఆలౌట్ అయ్యాయి. ఢిల్లీ తరుపున రోహిత్‌ 17 సార్లు రైడింగ్‌కు వెళ్లి 11 పాయింట్లు సాధించగా, ఆ జట్టు డిఫెండర్లు తేలిపోయారు. ట్యాకిల్‌లో ఆరు పాయింట్లు మాత్రమే సాధించారు.

 ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది 15వ ఓటమి

ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది 15వ ఓటమి

ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో ఢిల్లీకి ఇది 15వ ఓటమి కావడం గమనార్హం. ఆ జట్టు 21 మ్యాచ్‌లో 37 పాయింట్లు మాత్రమే సాధించి జోన్‌-ఎలో ఆఖరి స్ధానంలో ఉంది. మరోవైపు బెంగళూరు బుల్స్ 19 మ్యాచ్‌ల్లో 44 పాయింట్లతో జోన్‌-బిలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

మరో మ్యాచ్‌లో హర్యానాపై జైపూర్ ఘన విజయం

మరో మ్యాచ్‌లో హర్యానాపై జైపూర్ ఘన విజయం

బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలెర్స్‌ 37-27తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. దీపక్‌ (8), డిఫెన్స్‌లో సురేందర్‌ (8) రైడింగ్‌లో రాణించి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రో కబడ్డీలో గురువారం జరిగే మ్యాచ్‌లో జైపూర్‌తో యూపీ యోధా తలపడనుంది.

Story first published: Thursday, October 12, 2017, 11:24 [IST]
Other articles published on Oct 12, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి