న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL7: పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్‌.. ప్లేఆఫ్స్‌ ఆశలు ఆవిరి!!

Pro Kabaddi 2019 : Telugu Titans Out Of Playoffs After Loss To Puneri Paltan || Oneindia Telugu
PKL 7: Telugu Titans playoffs dream ends, after loss to Puneri Paltan

పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఆట మారడం లేదు. ఒక విజయం సాదించిందనుకునేలోపే వరుసగా పరాజయాలను చవిచూస్తోంది. ఒకటీ అరా విజయాలు తప్ప నిలకడగా రాణించలేకపోతున్న టైటాన్స్ మరో ఓటమి మూటగట్టుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 50-53తో పుణెరీ పల్టాన్ చేతిలో చేతిలో పోరాడి ఓడింది. పీకేఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరు ఈ మ్యాచ్‌లో నమోదయింది. టైటాన్స్‌ ఓటమితో యూపీ యోధా ఆరో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరింది.

ఐసీసీ నిర్ణయం: దక్షిణాఫ్రికా-భారత్ షెడ్యూల్‌లో మార్పు.. అదనంగా మరో టీ20ఐసీసీ నిర్ణయం: దక్షిణాఫ్రికా-భారత్ షెడ్యూల్‌లో మార్పు.. అదనంగా మరో టీ20

తెలుగు టైటాన్స్‌ టాప్‌ రైడర్‌ సిద్దార్థ్‌ దేశాయ్‌ విఫలమైనా.. రాకేశ్‌ గౌడ (17 పాయింట్లు) చేసిన పోరాటం వృథా అయ్యింది. పుణెరి తరఫున మంజీత్‌ (12 పాయుంట్లు), సుశాంత్‌ సెయిల్‌ (11 పాయింట్లు) రాణించారు. మ్యాచ్ ఆరంభం నుండే పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించిన పల్టాన్ 31-16తో మొదటి అర్ధ భాగాన్ని ముగించింది. ఒక దశలో టైటాన్స్‌ 21-44 తో వెనుకబడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకునేట్లు కనిపించింది. అయితే రాకేశ్‌ గౌడ (17 పాయింట్లు), ఫర్హాద్‌ మిలాఘర్దన్‌ (10 పాయింట్లు) పుంజుకోవడంతో టైటాన్స్ రేసులోకి వచ్చింది.

మ్యాచ్ చివరలో రాకేష్‌ విజృంభించడంతో చివరి 5 నిమిషాల్లో టైటాన్స్‌ స్కోరు సమం చేసేలా కనిపించింది. కానీ.. ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సాగిన పల్టాన్ 53-50తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రాకేశ్‌ గౌడ పోరాటం కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించింది. ఈ ఓటమితో మిణుకుమిణుకుమంటున్న తెలుగు టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్‌; హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడతాయి.

ఢిల్లీ, బెంగాల్, హరియాణా, బెంగళూరు, ముంబా, యూపీ జట్లు ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాయి. బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 59-36తో హరియాణా స్టీలర్స్‌పై భారీ విజయం సాధించింది. బెంగళూరు తరఫున రైడర్ పవన్‌ షెరావత్‌ ఒక్కడే రికార్డు స్థాయిలో 39 పాయింట్లు సాధించాడు. పవన్ 39 పాయింట్లు సాధించి పీకేఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు పర్‌దీప్ నర్వాల్ (33) పాయింట్లు సాధించాడు.

Story first published: Friday, October 4, 2019, 7:51 [IST]
Other articles published on Oct 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X